పద‌కోండు మందిపై స‌స్పెన్ష‌న్ వేటు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telanga image
Updated:  2018-03-13 01:21:51

పద‌కోండు మందిపై స‌స్పెన్ష‌న్ వేటు

దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో అసెంబ్లీలు జ‌రుగుతున్న తీరును చూసి చాలా మంది ఆ సీన్ చూడ‌కుండా ప‌క్క‌కు వెళుతున్నారు కాస్తో కూస్తో తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలు కేవ‌లం మాట‌ల యుద్దాల‌కు మాత్ర‌మే దిగుతాయి అనేది తెలిసిందే కాని తెలంగాణ‌లో కాంగ్రెస్ నాయ‌కులు స్పీక‌ర్ పై చేసిన దాడిపై తెలంగాణలో కాస్త ప్ర‌జ‌ల నుంచి ఇటు రాజ‌కీయ నాయ‌కుల నుంచి కూడా వ్య‌తిరేక‌త వ‌చ్చింది.
 
తొలిరోజు బ‌డ్జెట్ స‌మావేశంలో  తెలంగాణ ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ నేత‌లు తీవ్ర ఆందోళ‌న చశారు స‌భల్లో.. బ‌డ్జెట్  స‌మావేశంలో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప్ర‌సంగిస్తుండ‌గా ప్ర‌తి ప‌క్ష‌నేత‌లు నినాదాలు చేస్తూ, ప్ల‌కార్డ్‌లు ప్ర‌ద‌ర్శించి అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే అదే స‌మ‌యంలో  కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంక‌ట రెడ్డి త‌న హెడ్‌ఫోన్స్‌ను విసిరేశారు. అది నేరుగా శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు తగిలింది. దీంతో అక్క‌డున్న అధికారులు స్వామిగౌడ్‌ను హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించి అక్క‌డ చికిత్స అందించారు యావ‌త్ తెలంగాణ అంతా ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.. ప్ర‌తిప‌క్ష అత్యుత్సాహాన్ని విమ‌ర్శించారు.
 
దీంతో టీఆర్ఎస్ నాయ‌కులు ప్ర‌తిపక్ష నేత‌ల వైఖ‌రిని నిర‌సిస్తూ మంత్రి శాస‌న‌స‌భా వ్వవ‌హారాలు  కూడా చూస్తున్న హ‌రిష్ రావు వారిపై స‌స్పెన్ష‌న్ తీర్మానాన్ని నేడు  స్పీక‌ర్ ముందు ప్ర‌వేశ పేట్టారు... చ‌ట్టస‌భ‌ల్లో కాంగ్రెస్ స‌భ్యుల దాడిని తీవ్రంగా ప‌రిగ‌ణించిన స్పీక‌ర్ సుమారు ప‌ద‌కొండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు.
 
స‌స్పెన్ష‌న్ అయిన వారిలో కొమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి, జానారెడ్డి, జీవ‌న్ రెడ్డి, గీతా రెడ్డి, చిన్నారెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, డీకే అరుణ‌, మ‌ల్లు బ‌ట్టి విక్ర‌మార్క, పద్మావతి, టి.రామ్మోహన్‌రెడ్డి, డి.మాదవరెడ్డి, వంశీచంద్ ఉన్నారు. అలాగే  కొమ‌టి రెడ్డి,  వెంక‌ట‌రెడ్డి సంప‌త్‌ ఎమ్మెల్యేల స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసింది శాస‌న స‌భ‌.  
 
దీనికి స్పందించిన కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌భుత్వం వేటు వేయ‌డం పై తీవ్ర ఆ గ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిఎల్పీ నేత జానారెడ్డి ఆధ్వ‌ర్యంలో స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో  కాంగ్రెస్ పార్టీకి సంబందించిన మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.
 
సీఎల్పి స‌మావేశం త‌ర్వాత మీడియాతో మాట్లాడిన జానారెడ్డి నిన్న జ‌రిగిన సంఘ‌ట‌న పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అంశం పూర్తిగా గ‌వ‌ర్న‌ర్ ప‌రిగ‌ణ‌లో ఉంది. దానిని అతిక్ర‌మించి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డం రాజ్యాంగ విరుద్దం అని అన్నారు. అదే జ‌రిగితే శాస‌నస‌భ‌ను వ‌దిలి ప్ర‌జాస‌భ‌కు వెళ్తామ‌ని తెలియజేశారు.విప‌క్ష‌నేత‌ను సైతం స‌స్పెండ్  చేయ‌డం దారుణం అని అన్నారు. టి.పీసీసీ  అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ మాట్లాడుతూ స్పీక‌ర్ నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు.. దీని పై రాష్ట్ర‌ప‌తిని క‌లుస్తామ‌ని తెలియ‌జేశారు ఆయ‌న‌. 
 
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో శాస‌న స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిఫక్షంలో ఉన్న అపోజిష‌న్ లీడ‌ర్ ను స‌స్పెండ్ చేయ‌డం ఇదే రికార్డ్ అని అంటున్నారు సీనియ‌ర్లు.. ఇక సీఎల్పీ  నిర్ణ‌యం అదిష్టానానికి తెలియ‌చేసి వారి నిర్ణ‌యం ప్ర‌కారం మూకుమ్మ‌డిగా రాజీనామాలు చేసే యోచ‌న‌లో ఉంది తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటి ...మ‌రి తెలంగాణ‌లో  ఉప ఎన్నిక‌ల‌కు అంద‌రూ రాజీనామాలు చేసి వెళ్లాలి అని చూస్తున్నారు హ‌స్తం పార్టీ నాయ‌కులు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.