టిఆర్ఎస్ కు ఊహించని షాక్...

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-01-20 10:33:45

టిఆర్ఎస్ కు ఊహించని షాక్...

తెలంగాణ రాజ‌కీయాలు ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో కీల‌క పాత్ర పోషించిన   కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవడంతో అక్క‌డ రాజ‌కీయ ప‌రిణామాలు మారిపోయాయి. ఓ ర‌కంగా అధికార టీఆర్ ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ వ్యూహాలు ర‌చిస్తోంది. 

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర‌డంతో   గ‌త కొన్ని రోజులుగా తెలంగాణ రాజ‌కీయాలు వాడీ వేడిగానే కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు టీఆర్ ఎస్ పార్టీ నేత‌లు  కూడా  ప్ర‌తివ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి వ‌ర్గానికి చెందిన ప‌లువురు నాయ‌కుల‌ను ఇప్ప‌టికే లాగేసుకుంది టీఆర్ ఎస్ పార్టీ. 

అయితే,  ఈ సారి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు, కొడంగ‌ల్ లో ఎప్ప‌టినుండో టీఆర్ ఎస్ కు పెద్ద దిక్కుగా ఉన్న గుర్నాథ్ రెడ్డి కుటుంబం ఆస‌క్తి  చూపించింది. అయితే ఇప్పుడు అక్క‌డ  ప‌ట్నం బ్ర‌ద‌ర్స్ టికెట్టు రేసులో ఉన్నారు.  టీఆర్ ఎస్ పార్టీ అధిష్టానం కూడా వీరికే టికెట్టు కేటాయించేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు  వార్త‌లు వ‌స్తున్నాయి. 

దీంతో  కొడంగ‌ల్ టీఆర్ ఎస్ పార్టీలో ముస‌లం మొద‌లైంది. ఈ క్ర‌మంలో  తాజాగా గుర్నాథ్ రెడ్డి సోద‌రుడి కుమార్తె అనూ రెడ్డి రేవంత్ రెడ్డిని క‌ల‌వ‌డం ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేవ‌లం క‌ల‌వ‌డ‌మే కాదు.... ఏకంగా రేవంత్ రెడ్డికి మ‌ద్ద‌తు కూడా ప‌లికారు. 

గ‌తంలో రేవంత్ రెడ్డికి వ్య‌తిరేకంగా ప‌ర్య‌ట‌న‌లు చేసిన ఆమె...లోక‌ల్ లో ప్ర‌స్తుతం నెల‌కొన్న  రాజ‌కీయాల ప‌రిణామాల నేప‌థ్యంలో  రేవంత్ రెడ్డికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది.  ఈ క్ర‌మంలో  గుర్నాథ్‌రెడ్డి ఫ్యామిలీ ఏం చేస్తుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా   మారింది.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.