ప‌వ‌న్ పై చెప్పుల దాడి

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-01-24 05:24:40

ప‌వ‌న్ పై చెప్పుల దాడి

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు ఖ‌మ్మం ప‌ట్ట‌ణం ఎంబీ గార్డెన్స్ లో అభిమానుల‌తో క‌లిసి కార్య‌క‌ర్త‌ల స‌మావేశం నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్బంగా అక్క‌డ స‌మావేశంలో పెద్ద ఎత్తున ప‌వ‌న్ అభిమానులు చేరుకున్నారు.. ప‌వ‌న్ ను క‌లిసేందుకు పెద్ద ఎత్తున ఆయ‌న అభిమానులు అక్క‌డ‌కు చేరుకున్నారు.. ఈ స‌మ‌యంలో ఆయ‌న పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌ల‌తో క‌ల‌సి కాన్వాయ్ లో వెళుతున్నారు.. ఆ స‌మ‌యంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చెప్పులు వేశారు ప‌వ‌న్ పై.. దీంతో ఆయ‌న కారు పై చెప్పులు ప‌డ‌టంతో, అక్క‌డ ఆయ‌న సిబ్బంది వెంట‌నే అప్ర‌మ‌త్తం అయ్యారు.

దీంతో ప‌వ‌న్ సిబ్బంది అక్క‌డ నుంచి వెంట‌నే ప‌వ‌న్, ను ప‌క్క‌కు పంపారు.. అంతే కాక ప‌వ‌న్ స‌భ నుంచి హ‌డావుడిగా వెళ్లిపోయారు.. దీనిపై జ‌న‌సైనికులు మండిప‌డుతున్నారు.. కావాల‌నే ప‌వ‌న్ పై అక్క‌సుతో ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు అని వారు వాపోతున్నారు.... ప్ర‌జా స‌మ‌స్య‌లు తీర్చ‌డానికి ప‌వ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తే కొంద‌రు కావాల‌నే ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు అని అన్నారు జ‌న‌సైనికులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.