రేవంత్ స్పీడుకు కేసీఆర్ బ్రేకులు?

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-01-29 05:39:09

రేవంత్ స్పీడుకు కేసీఆర్ బ్రేకులు?

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి రాజ‌కీయ దూకుడు అంద‌రికి తెలిసిందే. తెలంగాణ ప్ర‌భుత్వం పై సీఎం కేసీఆర్ కుటుంబం పై తీవ్రంగా విమ‌ర్శ‌ల బాణాలు సందిస్తారు కొడంగ‌ల్ నాయ‌కుడు రేవంత్‌రెడ్డి... కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత , గులాబీ పార్టీ పాల‌న‌లో ఉన్న లోపాల‌ను ప్ర‌జాక్షేత్రంలో నిగ్గ‌తీసి అడుగుతున్నారు.....ఈయ‌న దూకుడుతో కేసీఆర్‌ను ఎదిరించే నాయ‌కుడు రేవంత్ ఒక్క‌డే అంటూ ప్ర‌జ‌లలో గుర్తింపు తెచ్చుకున్నారు.

ఒక వైపు ఆరోపణలు, విమర్శలూ చేస్తూనే న్యాయ స్థానాల్లో కేసులు వేస్తున్నారు స‌ర్కారు పై రేవంత్ రెడ్డి.. దీని వ‌ల్ల తెలంగాణ స‌ర్కార్ కుదేల‌వుతోంది.... ఇటీవ‌ల పార్టీ ఫిరాయింపుల పైనా, లాభదాయక పదవులు పొందిన వారిపై ఢిల్లీ త‌ర‌హా వేటు వేయాలని కేసు వేశారు రేవంత్.. ప‌లు కేసుల‌ను వేసి తెలంగాణ‌లో గులాబీ పార్టీని ఇరుకున పెడుతున్నారు రేవంత్ రెడ్డి.

అలాగే రేవంత్ దూకుడును ఆప‌డానికి కేసీఆర్ ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాల‌ను తెస్లోంది.. అస‌భ్య‌క‌ర‌మైన దూష‌ణ‌లు, ప‌దాలు స‌ర్కారుపై, నాయ‌కుల‌పై, కేబినెట్ హోదాలో ఉన్న నేత‌ల‌పై ప్ర‌యోగిస్తే కోర్టుకు సంబంధం లేకుండా నేరుగా అరెస్ట్ చేసే ఒక జీవో ను సైతం తెచ్చారు కేసీఆర్... ఈ జీవోను అవసరాన్ని బట్టి ఉప‌యోగిస్తార‌ని స్పష్టం అవుతోంది.

రేవంత్ దూకుడు త‌గ్గించాలంటే ఓటుకు నోటు కేసు బ‌య‌టకి తీయ‌డం మాత్ర‌మే స‌రైన కౌంట‌ర్ అంటున్నారు కారు పార్టీ నాయ‌కులు..... ఇందులో భాగంగానే మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దాడి మొద‌లు పెట్టారు రేవంత్ పై ... ఓటుకు నోటు కేసులో ప‌చ్చిగా దొరికిన రేవంత్‌కు? కేసీఆర్ ను విమ‌ర్శించే స్థాయి లేదంటూ రివ‌ర్స్ లో ప్ర‌శ్నించ‌డం మొద‌లుపెట్టారు... అయితే ఇటు తెలుగుదేశంనుంచి కాంగ్రెస్ లో చేరినా దొంగ దొంగే అంటున్నారు టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ఎప్ప‌టికైనా కోర్టుకు ఓటుకు నోటు కేసులో రేవంత్ కు శిక్ష ప‌డుతుంది అంటున్నారు కారు పార్టీ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.