కేసీఆర్ పోటీగా మరో పార్టీ

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-01-20 10:31:03

కేసీఆర్ పోటీగా మరో పార్టీ

న్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో తెలంగాణలో ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు ఈ సారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు  విస్రృతంగా ప‌లు కార్య‌క్ర‌మాలు  చేప‌డుతున్నారు. ఈ  నేప‌థ్యంలో టీజేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఒక సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న  చేశారు.... ఆయ‌న ఇటీవ‌ల విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి త‌న ప్రణాళిక‌ను ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా కోదండ‌రాం మాట్లాడుతూ తెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ పార్టీ ఏర్పాటుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని తెలియ‌చేశారు, తాను త్వ‌ర‌లో పార్టీ ప్ర‌క‌టించ‌బోతున్నాన‌ని తెలిపారు... ఆ నిర్ణ‌యం తానొక్క‌రిదే కాద‌ని త‌న‌కు అండ‌గా ఉన్న ప్ర‌తీ... ఒక్క‌రి నిర్ణ‌యం ప్ర‌కార‌మే పార్టీ స్థాపించ‌బోతున్నాన‌ని  స్ప‌ష్టం చేశారు.

అయితే రాష్ట్రంలో అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న దోపిడీలన్ని ఏ రాష్ట్రంలో  చేయ‌లేద‌ని ఆ దోపిడీల నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకే తామీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కోదండ‌రాం తెలిపారు. తాను త్వ‌ర‌లో పార్టీ స్థాపించిన త‌ర్వాత‌,  పూర్తి స్ధాయిలో ప్ర‌జ‌ల ప‌క్షాన‌ ఉంటాన‌ని తెలిపారు. ప్ర‌జ‌ల అండ‌తోనే తాను ఇంత స్తాయిలో ఉన్నాన‌ని, అయితే రానున్న ఎన్నిక‌ల‌లో వారు అవ‌కాశం ఇస్తే రాష్ట్రంలో అనేక అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను చేప‌డ‌తామ‌ని చెప్పారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.