కేసీఆర్ కి ద‌మ్ముంటే ఆ ప‌ని చేయాలి

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-05 03:26:54

కేసీఆర్ కి ద‌మ్ముంటే ఆ ప‌ని చేయాలి

తెలంగాణ‌లో హ‌త్యా రాజ‌కీయాలు ఎక్కువ అవుతున్నాయ‌ని తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు టీఆర్ ఎస్ పై ఫైర్ అవుతున్నారు.. తెలంగాణ‌లో జ‌రుగుతున్న హ‌త్యా రాజ‌కీయాల‌కు వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న‌ది తెలంగాణ సీఎం కేసీఆర్ అని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ నాయ‌కులు తీవ్ర స్ధాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 
ఇటీవ‌ల త‌న అనుచ‌రుడైన బొండుప‌ల్లి శ్రీనివాస్ హ‌త్య కూడా కేసీఆర్ ఆధీనంలోనే జ‌రిగింద‌ని, కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆవేదన‌ వ్య‌క్తం చేశారు. న‌ల్గొండ‌లో నిర్వహించిన బొండుప‌ల్లి శ్రీనివాస్ సంతాప స‌భ‌లో కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి మాట్లాడుతూ... త‌న అనుచ‌రుడు బొండుప‌ల్లి శ్రీనివాస్ లేడ‌నే నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నాన‌ని ఆయ‌న అన్నారు.
 
అందులో భాగంగానే ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ద‌మ్ముంటే న‌ల్గొండ‌లో త‌న‌పై రానున్న ఎన్నికల్లో పోటీ చేయాల‌ని స‌వాల్ విసిరారు... మేము హ‌త్యా రాజ‌కీయాలు చేస్తే న‌ల్గొండ‌లో మోరీల‌న్ని మెండాల‌తొ నింపేస్తామ‌ని కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి అన్నారు...అలాగే న‌ల్గొండ‌లో ఎమ్మెల్యే వీరేశం కిరాయి హంతకుడిగా మారాడని ఆయన విమర్శించారు.
 
త‌న అనుచ‌రుడు హ‌త్య కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తామ‌ని, అవ‌సర‌మైతే సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం సాధిస్తామని కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి  అన్నారు..... కాంగ్రెస్ కార్యకర్తల కోసం ప్రాణాలైన అర్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అవినీతి అధికారుల భరతం పడతామని హెచ్చరించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.