గులాబీ అధినేత పై ఆర్ నారాయ‌ణ మూర్తి కామెంట్ ?

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-01-29 03:09:15

గులాబీ అధినేత పై ఆర్ నారాయ‌ణ మూర్తి కామెంట్ ?

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో రైతు ప్రదర్శన, బహిరంగ సభ జరిగింది...ఈ స‌భ‌కు హ‌జ‌రైన ఆర్. నారాయణమూర్తి ప‌లు ఆస‌క్తిక‌రమైన‌ వ్యాఖ్య‌లు చేశారు.... నూత‌నంగా ఏర్ప‌డిన తెలంగాణ‌ రాష్ట్రానికి టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం సుప‌రిపాల‌న అందిస్తోంద‌ని......తెలంగాణ లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేప‌ట్టిన‌ సంస్క‌ర‌ణ‌లు గ‌త పాల‌కులు ఎవ‌రూ చేప‌ట్ట‌లేద‌ని అన్నారు.

ప్ర‌స్తుతం దేశంలో అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల‌లో తెలంగాణ మొద‌టి స్థానంలో ఉంది. దానికి కార‌ణం కేసీఆర్ ప‌రిపాల‌నే అని అన్నారు. ప్ర‌జాసేవ కోసం నిరంత‌రం ఆలోచించే ముఖ్య‌మంత్రి కేసీఆర్ అని ఆయ‌న ప్ర‌శంసించారు... రైతులకు, తెలంగాణ ప్రాంత ప్రజలకు 24 గంటల కరెంటును అందించిన ఘ‌న‌త కేసీఆర్ దేన‌ని అన్నారు. అలాగే 4వేల రూపాయ‌ల చొప్పున ఎకరాకు పెట్టుబడి అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం, నీటి సద్వినియోగానికి మిష‌న్ భ‌గీర‌థ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు.

అలాగే రైతు గిట్టుబాటు ధ‌ర పై కేంద్ర ప్ర‌భుత్వం ఆలోచ‌న‌, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రొఫెసర్ కోదండరాం, జేఏసీ నాయకుడు రాజేశ్వర్‌రావు మ‌రియు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.