వైయ‌స్ఆర్ నాకు ఆఫ‌ర్ చేశారు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-01-31 04:11:45

వైయ‌స్ఆర్ నాకు ఆఫ‌ర్ చేశారు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ  నేత, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు  ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో  ప‌లు విష‌యాలు గుర్తు చేసుకున్నారు. వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నేను వ‌ద్దాన్నా కూడా ఆర్టీసీ చైర్మ‌న్  ప‌ద‌వి ఇచ్చారు. నాకు పిలిచి మ‌రీ ఇళ్లు, కారు, డ‌బుల్ బెడ్ రూం, కొంత డ‌బ్బు ఇస్తా అని ఆఫ‌ర్ కూడా చేశారు.
 
అయితే నాకు అది న‌చ్చ లేదు..... అవ‌న్నీ తీసుకుంటే క్యారెక్ట‌ర్ బ్యాడ్ అవుతుంద‌ని అందుకే వైయ‌స్సార్  ఆఫ‌ర్ ఇస్తున్నా తిర‌స్క‌రించి ఏడ్చుకుంటూ బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని గుర్తు చేసుకున్న ప్ర‌కాష్ రావు మ‌రోసారి కంట త‌డి పెట్టుకున్నారు.  అవ‌స‌ర‌మైన‌పుడు నేనే అడిగి తీసుకుంటా అని వైయ‌స్ కు చెప్పాన‌ని  ప్ర‌కాష్ రావు అన్నారు.
 
వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డితో త‌న‌కు 1972 నుండి ప‌రిచ‌యం ఉంద‌ని, ముఖ్య‌మంత్రి కావడం వ‌ల్లే వైయ‌స్ కు ద‌గ్గ‌ర‌య్యార‌నేది అవాస్త‌వమ‌ని ఆయ‌న అన్నారు.  అప్ప‌ట్లో నేను వైయ‌స్సార్ కోవ‌ర్ట్ అని  చెప్పి  ద‌గ్గుపాటి నాకు  సీటు  రాకుండా చేశార‌ని ఆరోపించారు. 
 
విభ‌జ‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై తెలంగాణ వైసీపీ  నేత‌ల‌తో,  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒక్క‌సారి  చ‌ర్చించి  ఆ త‌ర్వాత‌ నిర్ణ‌యం తీసుకోవాల్సింద‌ని అన్నారు. విభ‌జ‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం వ‌ల్ల తెలంగాణ‌లో వైసీపీ ఇలాంటి ప‌రిస్ధితుల్లో ఉంద‌ని అన్నారు. ప్ర‌స్తుతానికి ఏ పార్టీలో లేన‌ని, త్వ‌ర‌లో కాంగ్రెస్ పార్టీలో చేరుతాన‌న‌ని  గోనె ప్ర‌కాష్ రావు తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.