రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-03 06:16:09

రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై గ‌త కొద్ది కాలంగా విమ‌ర్శ‌లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే.. కాగా ఈ నేప‌థ్యంలో రేవంత్ కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ నేత‌గా మారి ఓటుకు నోటు ఉధాంతంలో కాస్త ఊర‌ట తెచ్చుకోవ‌డంతో, ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి కారాలు మిరియాలు నూరుతున్నారు.
 
revanth reddy fire on kcr
 
అయితే ఈ మేర‌కు రేవంత్ రెడ్డి సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై మ‌రోసారి త‌న‌ధైన శైలిలో విమ‌ర్శ‌లు చేశారు...  సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టకుండా, ఇంటి నుంచి నిద్రావస్థలో పని చేస్తూ ఏడాది కాలం పూర్తి చేసుకున్న మన ముఖ్యమంత్రికి కుంభకర్ణ అవార్డు  ఇవ్వాలి అంటూ.. స్లీపింగ్ మోడ్ సీఎం @ తెలంగాణ సీఎం అంటూ రేవంత్ రెడ్డి త‌న సోష‌ల్ మీడియాలో ట్విట్ చేశారు... అయితే రేవంత్ రెడ్డి పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.