టీడీపీ యాక్షన్ కేసిఆర్ రియాక్షన్ అదిరిందిగా

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-01-20 10:44:17

టీడీపీ యాక్షన్ కేసిఆర్ రియాక్షన్ అదిరిందిగా

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు వ‌ర్దంతి నాడు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత మొత్కుప‌ల్లి  న‌ర‌సింహులు చేసిన వ్యాఖ్య‌లు ఒక్క‌సారిగా  రాజ‌కీయ దుమారాన్ని రేపాయి. 

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీని అధికార టీఆర్ ఎస్ పార్టీలో విలీనం చేస్తే మంచిద‌ని మోత్కుప‌ల్లి, చంద్ర‌బాబుకు స‌ల‌హా ఇవ్వ‌డం, ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు ఇటు టీఆర్ ఎస్ నేత‌ల‌తో పాటు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీడీపీ నేత‌లు ఘాటుగానే స్పందించారు. టీఆర్ ఎస్ పార్టీ నేత‌లు  మోత్కుప‌ల్లి చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించ‌డం విడ్డూరం. 

తెలుగుదేశం పార్టీ నేత‌లు మాత్రం ఎట్టి ప‌రిస్ధితుల్లో టీఆర్ ఎస్ లో క‌లిపే  ప్ర‌స‌క్తే లేద‌ని చెబుత‌న్నారు. అయితే ఈ త‌తంగమంతా  టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగి ఉంటుంద‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఓటుకు నోటు కేసు నుండి త‌ప్పించుకునేందుకు బాబు ఈ హైడ్రామాకు తెర లేపిన‌ట్లు  ప‌లువురు అనుమానిస్తున్నారు. 

ఇంందులో భాగంగానే టీ-టీడీపీలో కీల‌కంగా కొన‌సాగుతున్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి  చంద్ర‌బాబే కావాల‌ని జాయిన్ చేయించార‌నే  వాద‌న కూడా బ‌లంగా విన‌ప‌డుతోంది. రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్న స‌మ‌యంలో టీడీపీ నేత‌లు ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌క‌పోవ‌డం ఈ వాద‌న‌కు బ‌రింత బ‌లం చేకూరింది. 

టీడీపీ ఎన్ని కుయుక్తులు ప‌న్నిన‌ప్ప‌టికీ  టీఆర్ ఎస్ పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు త‌న‌దైన శైలిలో స్పందించారు. ఇండియా టుడే నిర్వ‌హించిన సౌత్ క‌న్ క్లేవ్ 2018 కార్య‌క్ర‌మంలో కేసిఆర్ గురువారం నాడు మాట్లాడ‌టం జ‌రిగింది.  తెలంగాణ రాష్ట్ర ప‌రిస్ధితుల‌పై ఆయ‌న సుధీర్ఘంగా మాట్లాడారు. 

అంతేకాకుండా, 2019 ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలిపారు. తాము ఎవరితోనూ కలవబోమని, ఎవరైనా తమతోనే కలవాలని అన్నారు. టీడీపీ యాక్ష‌న్-కేసిఆర్ రియాక్ష‌న్ నేప‌థ్యంలో   టీడీపీ-టీఆర్ ఎస్ పొత్తు వ్య‌వ‌హారంపై రాజ‌కీయ విశ్లేష‌కులు అనేక అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. 

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.