గ‌ద్వాల్ కోట‌లో కేటిఆర్ స‌వాల్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-01 10:27:12

గ‌ద్వాల్ కోట‌లో కేటిఆర్ స‌వాల్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ మ‌రోసారి కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు. అధికార ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కాంగ్రెస్ పార్టీ  మ‌హిళా ఎమ్మెల్యే డీకే అరుణ కంచుకోట అయిన‌టువంటి గ‌ద్వాల్ లో మంత్రి కేటిఆర్ ప‌ర్య‌టించి అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. 
 
 
పౌరుషాల పురిటిగ‌డ్డ  అయిన న‌డిగ‌డ్డ మీద చెబుతున్నా.... 2019 ఎన్నిక‌ల‌కు ఇంకా 20 నెల‌ల స‌మ‌యం ఉంది.. మాకు ప్ర‌జ‌ల మీద విశ్వాసం ఉంది.... మా ప్ర‌భుత్వం ప‌నితీరు మీద విశ్వాసం ఉంది.. ఖ‌చ్చితంగా ప్ర‌జ‌లు ప‌ని చేసేవారిని ఆధ‌రిస్తారన్న విశ్వాసం మాకు ఉంది. ఆ ఆత్మ‌విశ్వాసంతో చెబుతా  ఉన్నా....2019 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ క‌చ్చితంగా హైదారాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్  ప్ర‌భుత్వం రాక‌పోతే నేను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా...నీవు ఓడిపోతే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటావా అంటూ  టీపీసీసీ చీప్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి కేటిఆర్ సవాల్ విసిరారు.
 
 
గ‌తంలో తెలంగాణ‌కు కాంగ్రెస్ పార్టీ తీర‌ని అన్యాయం చేసింద‌ని, త‌ప్పుడు స‌ర్వేల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని సీట్లు సాధిస్తాం...ఇన్ని సీట్లు సాధిస్తాం అని సొల్లు క‌బుర్లు చెప్ప‌డం కాదు...ద‌మ్మంటే స‌వాల్ స్వీక‌రించాలంటూ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పై కేటిఆర్ ఫైర్ అయ్యారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.