ప‌వ‌న్ యాత్ర‌పై రాములమ్మ సెటైర్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-01-23 03:25:38

ప‌వ‌న్ యాత్ర‌పై రాములమ్మ సెటైర్

జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌రీంన‌గ‌ర్  జిల్లాలొ కొండ‌గుట్ట  ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యం నుంచి త‌న రాజ‌కీయ యాత్ర‌ను సోమ‌వారం ప్రారంభించారు. అయితే ఈ యాత్ర పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిప‌డుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు పొన్నం ప్ర‌భాక‌ర్ తెలంగాణాలో ప‌వ‌న్ రాజ‌కీయ యాత్ర చేయ‌కుండా అడ్డుకుంటామ‌ని తెలిపారు.
 
కాంగ్రెస్ పార్టీకి  మ‌హిళ నాయ‌కురాలు,సినీన‌టీ విజ‌య‌శాంతి కూడా  ప‌వ‌న్ యాత్ర పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  తెలంగాణ  ఉద్య‌మ స‌మ‌యంలో  జ‌రిగిన స‌క‌ల జ‌నుల స‌మ్మెలో   ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక టూరిస్ట్ అంటూ కేసిఆర్ విమ‌ర్శ‌లు చేసిన విష‌యాన్ని ఆమె గుర్తు చేశారు. 
 
ప్ర‌స్తుతం ప‌వ‌న్ రాజ‌కీయ యాత్ర  వీసా  క‌ల్పించిన కేసీఅర్ ప్ర‌భుత్వం.... అలాగే తెలంగాణ ఉద్య‌మ నేత‌ల‌కు, జేఏసి నేత‌ల‌కు కూడా వీసా   క‌ల్పించాల‌ని విజ‌య‌శాంతి డిమాండ్ చేశారు.  ప్ర‌జా స‌మ‌స్య‌ల పై పోరాటం చేస్తున్న నాయ‌కుల‌ను  అణిచి వేసే ధోర‌ణి  మంచిది కాదు. కేసీఅర్ ఇలాంటి విధానాన్ని  మార్చుకోవాల‌ని  విజ‌య‌శాంతి కోరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.