వైసీపీ జంపింగ్ ఎంపీ ప్ర‌క‌ట‌న

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-01-23 03:16:07

వైసీపీ జంపింగ్ ఎంపీ ప్ర‌క‌ట‌న

2014 ఎన్నిక‌ల్లో  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ప‌లువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ అయిన విష‌యం తెలిసిందే.  తెలంగాణ‌లో కూడా ఖ‌మ్మం పార్ల‌మెంట్ స‌భ్యుడిగా గెలిచిన ఒకే ఒక్క  వైసీపీ అభ్య‌ర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా  అధికార టీఆర్ ఎస్  పార్టీలోకి జంప్ అయ్యారు. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌నే వార్త‌లు ఇటీవ‌ల తెర‌పైకి వ‌చ్చాయి.  దీంతో  ఈ వార్త‌ల‌పై స్పందించిన పొంగులేటి.. మ‌ళ్లీ ఎంపీగా పోటీ చేసే అవ‌కాశం ఇస్తాన‌ని ముఖ్య‌మంత్రి  కేసిఆర్ హామీ ఇచ్చార‌ని గుర్తు చేశారు. 
 
ఖ‌మ్మం జిల్లాలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు అధికంగా ఉన్నందున‌, ఇక్క‌డ వారికే మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సి ఉంటుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. దీంతో పాటు త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెబితే ఖ‌చ్చితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ నుండి పోటీ చేస్తాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
హామీ ఇవ్వ‌ని ప‌క్షంలో ఖ‌మ్మం  ఎంపీగానే పోటీ చేస్తాన‌ని, ఇక్క‌డి నుండి నామ నాగేశ్వ‌ర్ రావు పోటీ చేస్తార‌న్న వార్త‌లు అబద్ద‌మ‌ని, అదేవిధంగా తాను కొత్తగూడెం నుంచి అసెంబ్లీకి పోటీచేస్తానన్నది కూడా  పుకారేన‌ని, ఎవరో ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు సృష్టించారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.