టీఆర్‌య‌స్‌లోకి ప్ర‌ముఖ హీరో

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-03-24 17:50:50

టీఆర్‌య‌స్‌లోకి ప్ర‌ముఖ హీరో

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీన‌టులు అభిమానుల‌ను సంపాదించుకున్న త‌ర్వాత రాజ‌కీయాల్లోకి రావ‌డం ష‌రామాములే. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తూ ఉండ‌డంతో  ప్ర‌ముఖ న‌టీన‌టులు రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తున్నారు... ఇప్ప‌టికే తమిళనాడులో రజినీకాంత్, కమల్ హాసన్ కొత్త పార్టీలు పెట్టి మరీ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఏపీలో పవన్ కళ్యాన్ జనసేన పార్టీ స్థాపించి వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక్షంగా పాల్గొనబోతున్నారనే విష‌యం జోరుగా ప్ర‌చారం సాగుతోంది.
 
తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ప్రముఖ సినీ నటుడు సుమన్ సిద్దం అవుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మన్న‌న‌ల‌ను పోందారు సుమ‌న్‌. ప్రస్తుతం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, ఒరియా భాష‌ల్లో న‌టిస్తున్నారు . భువనగిరిలో  మీడియాతో మాట్లాడిన హీరో సుమ‌న్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్ లో చేరుతానని తెలిపారు. 
  
తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ది ప‌థంలో న‌డిపిస్తున్నార‌ని అన్నారు. పేద ప్రజల కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారని సుమ‌న్ తెలిపారు. గౌడ కులానికి కేసీఆర్ చేసిన మేలు చాలా గొప్పదని అన్నారు. తమ జాతికి ఆయన చేసిన మేలుకు... ఆయనకు పాదాభివందనం చేస్తున్నామని ఆయ‌న‌ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తనకు ప్రత్యేక అభిమానం అన్నారు. అంతే కాదు  తన నుంచి కేసీఆర్ ఎలాంటి సహాయం పొందాలనుకున్నా దానికి తాను సిద్ధంగా ఉన్నానని సుమ‌న్‌ చెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.