దొంగ‌లంతా ఒక్క‌టి అవుతున్నారు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-09-14 06:29:56

దొంగ‌లంతా ఒక్క‌టి అవుతున్నారు

ప్ర‌గ‌తి నిరోధ‌కులు కావాలో ప్ర‌గ‌తి పాధ‌కులు కావాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తేల్చుకోవాల‌ని పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూమారుడు మంత్రి ఐటీ శాఖామంత్రి కేటీఆర్. కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన న‌లుగురు బీజేపీ కౌన్సుల‌ర్స్ అలాగే 350 మంది బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువాను క‌ప్పుకున్నారు. 
 
కేసీఆర్ ప్ర‌భుత్వం ప్రాజెక్టులు క‌డుతుంటే వాటిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేత‌లు కేసులు వేశార‌ని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలో ముదిగొండా భ‌షిర్ బాగ్ కాల్పుల‌కు కాంగ్రెస్ తెలుగుదేశంపార్టీలే కార‌ణం అని కేటీఆర్ ఆరోపించారు.
 
అంతేకాదు వ‌చ్చేఎన్నిక‌ల్లో బీజేపీకి గ‌డ్డుకాల‌మే అన్నారు. ఓట‌మి భయంతో దొంగ‌లంతా ఒక్క‌టి అవుతున్నారంటూ త‌మ‌దైన శైలిలో సెటైర్ వేశారు కేటీఆర్. ఎన్ని పార్టీలు క‌లిసిపోటీ చేసినా కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆఎస్ దే విజయం అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.