ప్రచారానికి నో చెప్పిన అల్లు అర్జున్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

allu arjun and tdp
Updated:  2018-10-30 16:53:38

ప్రచారానికి నో చెప్పిన అల్లు అర్జున్

మెగా ఫ్యామిలీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. 2009 లో ఎలెక్షన్స్ లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా చిరంజీవి పోటీ చేసింది తెల్సిన విషయమే. అయితే 2014 లో పవన్ కళ్యాణ్ కూడా జనసేన పేరు తో పార్టీ పెట్టి, తెలుగు దేశంకి మద్దతుగా ఉండి, ఇప్పుడు సింగల్ గా ఎలక్షన్స్ కి వెళ్దాం అనే ఆలోచనలో ఉన్న విషయం కూడా విదితమే. అయితే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టీడీపీ తరఫున ప్రచారం చేస్తారంటూ ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది.

బన్నీ మామ-ప్రముఖ విద్యావేత్త కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి ఆ పార్టీ తరఫున బరిలో దిగే అవకాశాలుండటమే ఇందుకు కారణం. మామ తరఫున ప్రచారానికి ఇప్పటికే సై అన్నాడని కూడా పలువురు చెబుతున్నారు. అయితే ఈ వార్తలన్నీ ఊహాగానాలేనని తెలుస్తోంది. అయితే మామ తరఫున ప్రచారానికి బన్నీ పూర్తి విముఖంగా ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ విముఖతకు ఆయన వద్ద తగిన కారణాలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానమైనది.. మెగా ఫ్యామిలీలో చిచ్చు రేగే అవకాశం. అల్లు అర్జున్ మావగారు తెలంగాణలో తెదేపా తరుపున బరిలోకి దిగే అవకాశం ఉంది.

అయితే ఆంధ్రలో పవన్ ప్రస్తుతం తెదేపా పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ దూసుకుపోతున్నారు. అలాంటి సమయంలో పవన్ వ్యతిరేకంగా ఉన్న పార్టీ తరుపు ప్రచారానికి బన్నీ సై అంటే మాత్రం మెగా ఫామిలీ అభిమానులు చీలి బన్నీ కెరీర్ కి ప్రమాదం. అసలే పవన్ కళ్యాణ్ అభిమానుల పై ఒకసారి చేసిన వ్యాఖ్యల వల్ల భారీగా దెబ్బ తిన్నాడు బన్నీ. మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఉండాలనే ఈ ప్రచారానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.