టీఆర్ఎస్ పొత్తుపై అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-09-15 03:25:32

టీఆర్ఎస్ పొత్తుపై అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌గ‌రుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ముంద‌స్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భార‌తీయ జ‌న‌తా పార్టీలు పొత్తు పెట్టుకున్నార‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ పొత్తుల‌పై ఆ పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా స్పందించారు. ఈ రోజు హైదాబాద్ లో ప‌ర్య‌టించిన ఆయ‌న పార్టీ కార్యాలాయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.
 
ఒకే దేశం ఒకే ఎన్నిక‌లు అనేది మా నాయ‌కుడి నినాదం అని అయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే ఇందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొద‌ట్లో ఒప్పుకున్నారని కానీ అక‌స్మాత్తుగా ఆయ‌న ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లార‌ని అమిత్ షా ఆరోపించారు. అయితే ఈ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో తాము టీఆర్ఎస్ తో పోట్టుపెట్టుకోమ‌ని స్ప‌ష్టం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కోట్ల రూపాయ‌ల‌ భారాన్ని ప్ర‌జ‌ల‌పై ఎందుకు వేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌పున తెలంగాణ‌లో అన్నిస్థానాల్లో త‌మ అభ్య‌ర్థులు పోటీ చేస్తార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ ప‌రిపాల‌న చూసిన త‌ర్వాత మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంద‌నుకోవ‌టం లేద‌ని అమిత్ షా అన్నారు. తెలంగాణ‌ను తిరిగి ర‌జ‌క‌ర్ల చేతిలో పెట్టాల‌నుకుంటున్నారా..! కేసీఆర్ అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు చేయ‌ట్లేదా..! డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ ఏమైంద‌ని అమిత్ షా సూటిగా ప్ర‌శ్నించారు.
 
కేసీఆర్ కుటుంబ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని కానీ బీజేపీ కుటంబ రాజ‌కీయాలు చేయ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జ‌ల‌ కోసం ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టింద‌ని అన్నారు. అంతేకాదు తెలంగాణ‌కు 13వ ఆర్థిక సంఘం ద్వారా సుమారు 16,597 కోట్లు ఇచ్చామ‌ని అన్నారు. తాము కంగ్రెస్ పార్టీ కంటే తెలంగాణ‌కు రెండు రెట్లు నిధులు కేటాయించామి అమిత్ షా తెలిపారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.