మ‌రో వివాదంలో ఆమ్ర‌పాలి

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-01-27 11:24:21

మ‌రో వివాదంలో ఆమ్ర‌పాలి

ఆమ్ర‌పాలి గ‌తంలో ఇంట‌ర్వ్యూల పై కామెంట్ చేసి అబ‌ద్దాలు చెప్పండి ఉద్యోగాలు పొందండి అని, కాస్త తెలంగాణ స‌ర్కిల్స్ లో ఆమె వార్త‌ల్లోకి వ‌చ్చారు.. ఇప్పుడు పెళ్లి వార్త‌లు రావ‌డంతో ఆమె పైనే స్పెష‌ల్ స్టోరీలు, ఆమె ప్రేమ పెళ్లిపై వార్త‌ల‌తో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నారు.. ఇక గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో ఆమె క‌లెక్ట‌ర్ గా జిల్లాకు సంబంధించి అభివృద్ది ప్ర‌ణాళిక గురించి, జ‌రిగిన అభివృద్ది గురించి ప‌రిపాల‌న గురించి స‌భ‌లో స్పీచ్ ఇస్తారు.

జెండా వంద‌నం త‌ర్వాత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ప్రసంగం మాత్రం నవ్వులపాలైంది...జిల్లాలో ఆమె స్పీచ్ మ‌ధ్య‌లో చేసిన ప‌నులు చర్చనీయాంశమ‌వుతున్నాయి.. ఆమె తన ప్రసంగం మధ్యలో అదే పనిగా అకారణంగా నవ్వడం...స్టాటిస్టిక్స్ చెప్ప‌డంలో తడబడటం పై ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్నారు..అంతేకాక మధ్యలో ఇట్స్‌ఫన్నీ అని వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం అయింది.. హన్మకొండ పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ ఆమ్రపాలి జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత, తెలుగులో రాసిన ప్రసంగ పాఠాన్ని చదువుతూ ఆమె అనేక సార్లు తడబడ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.