తెర‌పై మ‌రో రాజ‌కీయ నాయ‌కుడి బ‌యోపిక్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

tollywood
Updated:  2018-06-16 12:44:55

తెర‌పై మ‌రో రాజ‌కీయ నాయ‌కుడి బ‌యోపిక్

ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోను బ‌యోపిక్ ల హవా ఏ రేంజ్ లో కొన‌సాగుతుందో మ‌నంద‌రికీ తెలిసిందే. అయితే ఇప్ప‌టికే టాలీవుడ్ లో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌కరామారావు  బ‌యోపిక్ ను ఆధారంగా చేసుకుని విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఓ సినిమాను  తెరకెక్కించ‌నున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ల‌క్ష్మిస్ ఎన్టీఆర్ అనే టైటిల్ కూడా ఖ‌రారు చేసింది చిత్ర యూనిట్. 
 
ఇక‌ ఇదే క్ర‌మంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ కూడా ఎన్టీఆర్ బ‌యోపిక్ పై మ‌రో చిత్రాన్ని తెకెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో త‌న తండ్రి పాత్ర‌లో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్నారు.ఇక‌ ఇప్ప‌టికి ఈ సినిమ‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ కి కూడా చిత్ర‌యూనిట్ టెంకాయ కొట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే  కొన్ని అనివార్య కార‌ణాల‌వ‌ల్ల‌ ఈ సినిమా ద‌ర్శక‌త్వం నుంచి తేజ త‌ప్పుకున్నారు.
 
ఇక ఇదే త‌రహాలోనే దివంగ‌త నేత ముఖ్యంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత క‌థ‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు వి.ర‌ఘవ్ తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి వైఎస్ ప్ర‌ధాన‌ పాత్ర‌లో న‌టించ‌నున్న‌ హీరో అలాగే వైఎస్ కుటుంబ స‌భ్యుల‌ క్యారెక్ట‌ర్స్ కు సంబంధించిన న‌టీన‌టుల‌ను చిత్ర‌యూనిట్ ఖ‌రారు చేసింది.
 
అయితే ఇదే క్ర‌మంలో వరంగల్ జిల్లాకు చెందిన కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి ఓ కన్నడ మహిళా దర్శకత్వం వహించ‌నున్నార‌ని వార్త‌లు వస్తున్నాయి. అయితే ఇప్ప‌టికే మురళి చ‌రిత్ర‌ను తెలుసుకునేందుకు చిత్ర యూనిట్ ప‌లుమార్లు ఆయ‌న‌ను సంప్రదించి రాజ‌కీయ‌ చ‌రిత్రకు సంబంధించిన కీల‌క విష‌యాల‌ను సేక‌రించారట‌. ఈ విష‌యాల‌ను సేక‌రించిన వెంట‌నే సెట్స్‌పైకి వెళ్లనుంద‌ని వార్తలు వ‌స్తున్నాయి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.