టీఆర్ ఎస్ స‌ర్కార్‌పై ప్ర‌సంశ‌ల వ‌ర్షం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-20 02:29:19

టీఆర్ ఎస్ స‌ర్కార్‌పై ప్ర‌సంశ‌ల వ‌ర్షం

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్  ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం అనేక సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టింది. దీంతో తెలంగాణ స‌ర్కార్ పై రాష్ట్ర ప్ర‌జ‌లు  ఎన‌లేని అభిమానం పెంచుకున్నారు. ముఖ్య‌మంత్రి కేసిఆర్ త‌న పరిజ్ఞానంతో ప్ర‌జా ప్ర‌యోజ‌నాలను దృష్టిలో ఉంచుకుని ప‌రిపాల‌న‌ చేస్తున్న తీరు అమోఘం.
 
కేసిఆర్ ప్ర‌వేశ‌పెట్టిన భూ రికార్డుల ప్రక్షాళన, కేసీఆర్‌ కిట్స్‌, భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణం, రైతులకు పెట్టుబడి మద్దతు వంటివి గొప్ప కార్యక్రమాలు ఎంద‌రినో ఆకర్షిస్తున్నాయి. తాజాగా గులాబి బాస్‌తో భేటీ అయిన కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద సుబ్రమణియన్  మాట్లాడుతూ...  తెలంగాణాలో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు దేశానికే ఆదర్శం అని కొనియాడారు.
 
రాష్ట్రంలో పంట పెట్టుబ‌డికి రైతుల‌కు ఆర్థిక స‌హ‌యం అందించ‌డం గొప్ప కార్య‌క్ర‌మం అని అన్నారు. ఏప్రిల్‌ 20న ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఈ కార్యక్రమాన్ని, జాతీయ కార్యక్రమంగా నిర్వహించాలని.... అందులో తాను కూడా పాల్గోంటాన‌ని కేసిఆర్‌కు తెలిపారు సుబ్రమణియన్. శాంతిభద్రతల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందంటూ ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల గురించి అడిగి తెలుసుకున్న ఆయ‌న‌.... కేసీఆర్‌ కిట్‌ వస్తువులను స్వయంగా పరిశీలించారు. హరితహారం, మిష‌న్ భ‌గీర‌ధ‌ పథకాలు తెలంగాణలో అమ‌లు అవుతున్న తీరు ఆనందం క‌లిగించింద‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.