వ‌చ్చే ఎన్నిక‌ల్లో బూతు బాబు ప‌నిగోవిందా..?

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telangana cm kcr
Updated:  2018-08-20 12:32:57

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బూతు బాబు ప‌నిగోవిందా..?

కేసీఆర్ స‌చ్చుడా..తెలంగాణ వ‌చ్చుడా అనే నినాదంతో ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం పోరాటం చేసిన కేసీఆర్ అనుకున్నది సాధించ‌డంలో సిద్ధ‌హ‌స్తుల‌య్యారు. దీంతో ప్ర‌జ‌లు ఇది మా తెలంగాణ‌..ఉద్య‌మాన్ని ముందుండి న‌డిపించిన కేసీఆర్ ను ముఖ్య‌మంత్రిని చేస్తున్నాం అంటూ గ‌త ఎన్నిక‌ల్లో చేసి చూపించారు. మ‌రి ఈ ఎన్నిక‌లు ఎలా ఉండ‌బోతున్నాయి. 
 
కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ తెలంగాణ‌ ప‌ర్య‌టన‌పై స్పందించిన ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల కోసం పోటీ అభ్య‌ర్ధుల జాబితాను సెప్టెంబ‌ర్ లో ప్ర‌క‌టిస్తామ‌ని హింట్ ఇచ్చారు. సెప్టెంబ‌ర్ 2న ప్ర‌గ‌తి నివేద‌న పేరుతో ఔట‌ర్ రింగ్ రోడ్ లో భారీ బ‌హిరంగం స‌భ‌ను నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. అంతేకాదు అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితా ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు. అంతే కేసీఆర్ ప్ర‌క‌ట‌నతో అధికార పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు మొద‌ల‌య్యాయి. ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్ డ్ అయిన, ప్ర‌స్తుతం  టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బాబుమోహ‌న్  ఉన్న ఆంథోల్ నియోజ‌క‌వ‌ర్గం లో ఈ కుమ్ములాట‌లు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు స‌మాచారం. 
 
మాజీ  సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేసిన బాబుమోహ‌న్ 2014లో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకొని ఎమ్మెల్యేగా గెలుపొందారు.  అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో  బాబుమోహ‌న్ గెలుపు డూఆర్ డైగా మారింది. గెలుపు సంగ‌తేమో టికెట్ వ‌స్తుందా..?  రాదా అనే అనుమానం మొద‌లైంది. త‌న నోటి దూల‌తో నియోజక‌వ‌ర్గ ప్ర‌జ‌ల మ‌న్న‌ల్ని పొంద‌లేక‌పోతున్నార‌నే  ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీనికి తోడు సీఎం కేసీఆర్ చేసిన స‌ర్వేలో బాబు మోహ‌న్ ప‌నితీరుపై ప్ర‌తీకూలంగా వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.   
 
దీన్ని అవ‌కాశంగా భావిస్తున్న జ‌ర్న‌లిస్ట్ కాంత్రికిర‌ణ్ స్థానిక నినాదంతో చేస్తున్న ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న త‌రుణంలో అధికార పార్టీ త‌న‌కే టికెట్ ఇస్తుంద‌ని విప‌రీతంగా  ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఈ ప్ర‌చారం బాబుమోహ‌న్ నోటి దురుసు వ‌ల్లే.   
 
గ‌తేడాది నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన బాబుమోహ‌న్ త‌న స్థాయిని మ‌రిచారు. బాబుమోహ‌న్ మాట్లాడే స‌మ‌యంలో ఓ వ్య‌క్తి డ‌బుల్ బెడ్ రూముల ప్ర‌స్తావ‌న తెచ్చారు. అంతే క‌స్సుమ‌న్న ఎమ్మెల్యే త‌న నోటికి ప‌నిచెప్పారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తూ నానా మాట‌లన్నారు. స‌ద‌రు వ్య‌క్తి డబుల్ బెడ్రూంల ప్రస్తావన తేవడంతో.. నువ్వు ఇక్కడ ఉండొద్దు.. కడుపు కాగానే పిల్ల పుట్టదు.. 9 నెలలు ఆగాకే పిల్ల పుట్టుద్దంటూ... బూతుపురాణం అందుకున్నారు.
 
దీన్ని వీడియో తీసిన కొంద‌రు సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్ అయ్యింది. దీన్ని ప్ర‌ధాన అస్త్రంగా మార్చుకున్న ప్ర‌త్య‌ర్ధులు ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాట‌లేనా. సినీ నటుడిగా తెలుగు ప్రజల్లో విశేషమైన గుర్తింపును పొందిన బాబు మోహన్ ఇలా మాట్లాడటం ఏంటని వీడియో చూసిన వారు నోరెళ్ల బెట్టారు. మరి బాబు మోహన్ గారూ.. కడుపు కాగానే పిల్ల పుట్టదు కానీ.. ఈ మూడున్నరేళ్లలో మీ ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించిందో లెక్కలు చెబుతారా కాస్తా అంటూ ప్ర‌శ్నించారు. 
 
ఆ త‌ర‌హా వ్య‌క్తిత్వం వ‌ల్లే  పార్టీలో గ్రూపు రాజ‌కీయాల‌కు బీజం ప‌డింది. నియోజ‌క‌వ‌ర్గంలో మూడు మార్కెట్ క‌మిటి ఛైర్మ‌న్ ప‌ద‌వులు ఉన్నాయి. వాటిలో రెండు త‌న అనుచ‌రుల‌కు ఇవ్వ‌గా , మ‌రొక‌టి మంత్రి హ‌రీష్ రావు అనుచ‌రుడు ద‌క్కించుకున్నారు. 
 
అయితే  బాబుకు అనుచ‌రులుగా ఉన్న ఆ ఇద్ద‌రు హ‌రీష్ అనుచ‌రుడికి మ‌ద్ద‌తు ప‌లికారు. బాబుకు దూరంగా ఉంటూనే ప్ర‌త్య‌ర్ధికి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం కొత్త రాజ‌కీయానికి తెర‌తీసింది. ఇప్పుడు ఇద్ద‌రు కూడా విడిపోయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక హ‌రీష్ అనుచ‌రుడు గ‌జ్వేల్ కు జెడ్పీటీసీగా చేసిన వెంక‌ట‌య్యకు మ‌ద్ద‌తు ప‌లికారు. వెంక‌ట‌య్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్న‌ట్లు చెప్పారు.  
 
ఇక మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి వ‌ర్గం స్థానిక నినాదంతో ఉద్య‌మం చేస్తున్న క్రాంతికిర‌ణ్ కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. కిర‌ణ్ కు హ‌రీష్ రావు, క‌విత అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నట్లు తెలుస్తోంది.  
 
ఈ నేప‌థ్యంలో బాబుమోహ‌న్ అనుచ‌రులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ నాయ‌కుడికి టికెట్ వ‌స్తుందా..? రాదా..? అని అయోమ‌యంలో, ఆందోళ‌న‌లో ఉన్నారు. మ‌రి ఇవ‌న్నీ ప‌టా పంచ‌లు కావాలంటే వ‌చ్చే నెల‌వ‌ర‌కు వేచి చూడాల్సిందే.   

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.