కేసీఆర్ పార్టీని బ‌జారుకు ఈడ్చారు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telangana cm kcr
Updated:  2018-09-03 01:01:18

కేసీఆర్ పార్టీని బ‌జారుకు ఈడ్చారు

తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ప్ర‌గ‌తి నివేదిన స‌భ... ఆవేద‌న స‌భ‌లా జ‌రిగింద‌ని రాష్ట్ర భారతీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్‌ అన్నారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, సుమారు 40 నిమిషాల పాటు మాట్లాడిన కేసీఆర్ మాట‌ల‌న్ని అబ‌ద్దాలే అని ఆయ‌న ఆరోపించారు. 
 
అధికార బ‌లంతో టీఆర్ఎస్ నాయ‌కులు కేంద్రం ప్ర‌జ‌ల కోసం కేటాయించిన నిధుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఇత‌ర రాష్ట్రాల్లో రాజ‌కీయ నాయ‌కులు సొంత డ‌బ్బుతో కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేసి స‌భ‌ల‌ను నిర్వ‌హిచార‌ని కానీ మ‌న ముఖ్య‌మంత్రి మాత్రం ప్ర‌జా ధ‌నాన్ని ఖ‌ర్చు చేసి ప్ర‌గ‌తి నివేదిన స‌భ నిర్వ‌హించార‌ని ల‌క్ష్మ‌ణ్‌ ఆరోపించారు. కేసీఆర్ స‌భ‌కు సుమారు 25 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు హాజ‌రు అవుతార‌ని చెప్పారు. కానీ మూడుల‌క్ష‌ల‌మంది కూడా హాజ‌రుకాలేద‌ని అన్నారు. 
 
ఈస‌భ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతీయ మీడియాల‌ను మ‌భ్య‌పెట్టాల‌ని చూశార‌ని కానీ నిన్న ఆ పార్టీ ప‌రువు బ‌జారున ప‌డింద‌ని ల‌క్ష్మ‌ణ్‌ ఆరోపించారు. కేసీఆర్ ప్ర‌భుత్వ ప‌రిపాల‌నను ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. ఇక ఇప్పుడు ఎన్నిక‌లు దగ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో టీఆర్ఎస్ నాయ‌కులు తెలంగాణ సెంటిమెంట్ ను ఉప‌యోగించుకోవాల‌ని చూస్తున్నార‌ని ల‌క్ష్మ‌ణ్‌ ధ్వ‌జ‌మెత్తారు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.