కోదండ‌రాంకు తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-12 01:50:52

కోదండ‌రాంకు తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం

టీజేఏసీ నాయ‌కుడు ఓయూ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం కు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది...  నాలుగేళ్ల పాల‌న‌లో న‌ల్గొండ‌ అభివృద్ది అనే కార్య‌క్ర‌మం న‌ల్గొండ‌లో ఏర్పాటు చేశారు జిల్లా వాసులు... వారు ఏర్పాటు చేసిన కార్యక్ర‌మానికి ముఖ్య అతిథి గా కోదండరాం హాజ‌ర‌య్యారు.
 
ఈ కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత హైద‌రాబాద్ తిరుగు ప్ర‌యాణం చేస్తుండ‌గా, మ‌ధ్య‌లో ఆయ‌న ప్ర‌యానిస్తున్న ఇన్నోవా వాహ‌నం ప్ర‌మాదానికి గురైంది...... ఈ ప్ర‌మాదంలో కోదండ‌రాం చేతి వేలికి స్వ‌ల్ప గాయం అయిన‌ట్లు జేఏసీ నాయ‌కులు తెలిపారు... చికిత్స నిమిత్తం ఆయ‌న‌ను హైద‌రాబాద్ కు త‌ర‌లించారు.
 
ర‌హ‌దారిలో అటుగా వ‌స్తున్న బైక్ ను  త‌ప్పించ‌బోయే క్ర‌మంలో ప‌క్క‌న ఉన్న డివైడ‌ర్ ను ఢీ కొట్ట‌డంతో  ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది... ఈ ప్ర‌మాదంలో కోదండ‌రాం కు స్వ‌ల్ప గాయాలు కాగా, బైక్ లో ప్రయాణిస్తున్న ఇద్ద‌రు యువ‌కుల‌కు తీవ్ర గాయాలు  అయ్యాయి...దీంతో  వారిని నల్గొండలోని స‌మీప ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.