కేసుల ప‌ర్వాన్ని ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

congress party
Updated:  2018-09-29 11:07:26

కేసుల ప‌ర్వాన్ని ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్

బిడ్డా కేసీఆర్‌..! గుర్తుపెట్టుకో..! నీకు, నీ వారసులకు మొత్తం లెక్కకట్టి అప్పజెబుతా. నువ్వు న‌న్ను చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు పంపినా, అండ‌మాన్ జైలుకు పంపినా భ‌య‌ప‌డేది లేదు. గ‌తంలో తిన్న చిప్పుకూడు సాక్షిగా చెబుతున్నా నిన్నుగ‌ద్ద దించుతా. తిరుమ‌ల వెంక‌న్న సాక్షిగా జైలులో ఉండి నామినేష‌న్ వేసి 50వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి తాజామాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన స‌వాల్. అయితే వ‌రుస‌గా కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌ల‌పై ఐటీ, ఈడీ దాడులు చేయ‌డంతో రాజ‌కీయం వేడెక్కింది. అరెస్ట్ ల‌తో టీఆర్ఎస్ పై ఉన్న వ్య‌తిరేక‌త‌, కాంగ్రెస్ పై సింప‌తి రోజురోజుకు పెరిగిపోతున్నట్లు స‌ర్వేలు చెబుతున్నాయి.
 
ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌లు అరెస్ట్ లు కావ‌డం ఆపార్టీని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. రాహుల్ గాంధీ స‌రూర్ న‌గ‌ర్ స‌భ త‌రువాత అరెస్ట్ ల ప‌ర్వం కొన‌సాగుతూ వ‌స్తుంది. 2004లో నకిలీ ప‌త్రాల‌తో పాస్ పోర్ట్ , గుజారాత్ కు చెందిన ముగ్గురిని త‌న కుటుంబ‌స‌భ్యులుగా చూపిస్తూ అమెరికాకు పంపార‌నే ఆరోప‌ణ‌ల‌తో టాస్క్ ఫోర్స్ పోలీసులు 8 సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసి జ‌గ్గారెడ్డిని అదుపులోకి తీసుకొని విచార‌ణ చేప‌ట్టారు.
 
విచార‌ణ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన జ‌గ్గారెడ్డి..నా అరెస్ట్ రాజ‌కీయ కక్ష. సిద్ధ‌పేట‌లో త‌మ అభ్య‌ర్దిని గెలుపించుకునేందుకు ఇలా చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపాల‌ని హ‌రీష్ -  కేసీఆర్ లు కుట్ర చేస్తున్నార‌న్న జ‌గ్గారెడ్డి..తాను ఎవ‌రిని విదేశాల‌కు తీసుకెళ్ల‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. 
 
అయితే కొన్ని వ్యూహాత్మాక సంఘ‌ట‌నల మ‌ధ్య జగ్గారెడ్డికి ఊరట లభించింది. మానవ అక్రమ రవాణా  కేసులో సికింద్రాబాద్ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రెండు రూ. 50 వేల పూచీకత్తుతో కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రతి ఆదివారం మార్కెట్ పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని జగ్గారెడ్డికి సూచించింది. బెయిల్ రావడంతో ఆయన చంచల్‌గూడ జైలు నుంచి విడుద‌ల‌య్యారు. 
 
అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన కీల‌క నేత‌ల‌పై వ‌రుసగా కేసులు న‌మోదు అవ్వ‌డంపై ఆ పార్టీనేత‌లు గులాబీ బాస్ పై గుస్సా అవుతున్నారు. ఇన్ని రోజులుగా లేని కేసులు ఎన్నిక‌ల స‌మీపిస్తున్న త‌రుణంలో ఎందుకు లేవ‌నెత్తుతున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. కేసీఆర్ త‌న మాట‌లగార‌డితో రాష్ట్ర ప్ర‌జ‌ల్ని మోసం చేసి ..ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌వుతావేమోన‌న్న భ‌యంతో ఇలా చేస్తున్నార‌ని ఆరోపించారు. కేసీఆర్ ఎంత‌మందిని అరెస్ట్ చేసిన త‌మ‌పార్టీ నేత‌లు నిజాయితీకి నిలువుటద్ద‌మని స‌మ‌ర్ధిస్తున్నారు. 
 
కేసులు, స‌మ‌ర్ధించడాలు ఎలా ఉన్నా ముంద‌స్తు ఎన్నిక‌ల ముందు టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్ష‌నేత‌ల్ని కేసుల పేరుతో వేధించ‌డంపై ప‌లువురు పెద‌వివిరుస్తున్నారు. దీనికి తోడు కేసులు పెట్ట‌డం వ‌ల్ల కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ అమాంతం పెరిగిపోతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అరెస్ట్ ల‌తో పార్టీకి, పార్టీనేత‌లకు బోలెడంత ప్ర‌చారం, సింప‌తీలు పెరిగి ఓటింగ్ ప‌ర్సంటేజ్ పెరుగుతుంద‌నేది స‌గ‌టు కాంగ్రెస్ అభిమాని వాద‌న.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.