ఎన్టీఆర్, ప్ర‌భాస్ ల‌కు ఛాలెంజ్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

jr ntr and prabhas
Updated:  2018-08-10 04:04:03

ఎన్టీఆర్, ప్ర‌భాస్ ల‌కు ఛాలెంజ్

తెలంగాణ సినిమాటోగ్ర‌ఫి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్‌ చైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గ్రీన్ ఛాలెంజ్ విసిరిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆయ‌న విసిరిన ఛాలెంజ్ ఈ రోజు త‌ల‌సాని స్వీక‌రించి సికింద్రాబాద్ లో ఉన్న త‌న నివాసంలో మూడు మొక్క‌ల‌ను నాటారు. ఆ త‌ర్వాత హీరో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కు, జూనియ‌ర్ ఎన్టీఆర్ కు, అలాగే ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కు, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ల‌కు త‌ల‌సాని గ్రీన్ ఛాలెంజ్‌ విసిరారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ప్ర‌తిష్టాత్మ‌కంగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన హ‌రితహారం ప‌థ‌కం కింద ప్ర‌తీ ఒక్క‌రు త‌మ ఇంటిముందో లేక వారికి ఇష్ట‌మైన ప్రాంతంలో మొక్క‌ను నాటాల‌ని మంత్రి త‌ల‌సాని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు త‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన స‌న‌త్ న‌గ‌ర్ లో కూడా ప్ర‌తీ ఒక్క‌రు గ్రీన్ ఛాలెంజ్ స్వీక‌రించి మొక్క‌ల‌ను నాటాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.
 
భ‌విష్య‌త్ త‌రాల‌కు స్వ‌చ్చందంగా ఆక్సిజ‌న్ అందాలంటే ప్ర‌తీ ఒక్క‌రు ఇప్ప‌టినుంచే మొక్క‌ల‌ను నాటాల‌ని, మొక్క‌ను నాట‌డ‌మే కాకుండా వాటిని సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లను తీసుకోవాల‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ సూచించారు. అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.