కేసీఆర్ ఓట‌మికి కంక‌ణం క‌ట్టుకున్న చంద్ర‌బాబు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr and chandrababu naidu
Updated:  2018-09-24 14:49:07

కేసీఆర్ ఓట‌మికి కంక‌ణం క‌ట్టుకున్న చంద్ర‌బాబు

ముందుస్తు ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని, కేంద్రంలో బీజేపీని క‌ట్ట‌డి చేసేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. తెలంగాణ‌లో మ‌హాకూట‌మిని అధికారంలోకి తీసుకు వ‌స్తే ప్ర‌త్య‌ర్ధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌నేది ఆయ‌న వ్యూహం. అందుకు చంద్ర‌బాబు మాజీ జ‌మ్ము - కాశ్మీర్ ముఖ్యమంత్రి గులాంన‌బీ ఆజాద్ తోడ్పాటు తీసుకుంటున్నారు. మ‌రి చంద్ర‌బాబు - గులాంన‌బీ ఎన్నిక‌ల వ్యూహ‌ర‌చ‌న చేస్తే గెలుపు సాధ్య‌మేనా అంటే అవున‌నే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
 
ఎన్నిక‌ల్లో మ‌హాకూట‌మి ద్వారా టీఆర్ఎస్ పార్టీని నిలువ‌రించ‌గ‌లిగితే రాష్ట్రంలో గులాబీపార్టీ నుంచి, కేంద్రంలో క‌మ‌లం దాడుల నుంచి త‌ప్పించుకునే అవ‌కాశం ఉంది. దీన్ని అంచ‌నావేసిన చంద్ర‌బాబు మ‌హాకూట‌మి ద్వారా  టీఆర్ఎస్ ప్ర‌తీకూల ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల వ్యూహ‌ర‌చ‌న ద్వారా కేసీఆర్ గెలుగుపును అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో విజ‌య‌వాకాశాల్ని అంచ‌నా వేస్తూ మ‌హాకూట‌మిద్వారా త‌న గెలుపు బీజం వేసేలా తెర‌వెనుక మంత్రాగాన్ని నెరుపుతున్నారు. 
 
అంతేకాదు ఎన్నికల‌పై వ్యూహ‌ర‌చ‌న చేసేందుకు టీడీపీ నుంచి చంద్ర‌బాబు, కాంగ్రెస్ నుంచి గులాంనబీ ఆజాద్ లు ఎత్తులు వేస్తున్నారు. ప్ర‌చారం ఎలా చేయాలి..? ఏ విధంగా చేయాల‌ని పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో చ‌ర్చిస్తున్నారు.దీనికి అవ‌స‌ర‌మైతే మ‌హాకూట‌మి నాయ‌కులకు ఛైర్మ‌న్ ల‌ను నియ‌మించాల‌ని, ఆ చైర్మ‌న్ల‌కు అధ్య‌క్షుడిగా కోదండ‌రామ్ ను ఎంపిక చేయాల‌ని భావిస్తున్నారు. 
 
ముందుగా మ‌హాకూట‌మిలో కేసీఆర్ ప్ర‌క‌టించిన 105స్థానాల్లోని 68 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌తీకూల ప‌రిస్థితులున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిచే అభ్య‌ర్ధుల్ని నిల‌బెడితే సునాయ‌సంగా గెల‌వ‌చ్చ‌నేది చంద్ర‌బాబు ప్ర‌తిపాద‌న‌.ఇక టికెట్లు రాక అధిష్టానంపై అస‌మ్మ‌తితో ర‌గ‌లిపోతున్న అభ్య‌ర్ధుల్ని కూటమి పార్టీలో చేర్చుకునేలా మంత‌నాలు జ‌రుగుతున్నాయి. 
 
ఇక మైనార్టీలు త‌న‌కే ఓట్లు వేస్తార‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్. అయితే మ‌హాకూట‌మిలో హైద‌ర‌బాద్ ఓల్డ్ సిటీ మిన‌హామిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో మైనార్టీ  ఓట్లు దండుకునేందుకు గులాంన‌బీ ఆజాద్ తో ప్ర‌చారం చేయిస్తే మంచి ఫ‌లితాలు రాబ‌ట్ట‌వ‌చ్చ‌నేది ఆలోచ‌న.
 
టీఆర్ఎస్ పార్టీ మ‌హాకూట‌మిని చీల్చిచెండాడేస్తుంది. ఒంటరిగా మాపై గెలిచే ధైర్యం లేక మ‌హాకూట‌మినిరంగంలోకి తెచ్చార‌నేది ఆ పార్టీవాద‌న‌. ఎన్నిపార్టీలు క‌లిసినా టీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవ‌డం ఎవ‌రి త‌రంకాద‌ని, మ‌హాకూట‌మి అనేది ఓ అప్ర‌విత క‌ల‌యిక అంటూ గులాబీ నేత‌లే ప్ర‌చారం ముమ్మురం చేస్తున్నారు. అదే రూట్లోకి వెళ్లి గ‌తంలో రాష్ట్ర విభ‌జ‌న చేస్తే త‌న పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తాన‌ని కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఆ ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లి త‌ద్వారా కూట‌మి అప్ర‌విత క‌ల‌యిక కాద‌ని నిరూపించ‌వ‌చ్చ‌నేది మ‌రికొంద‌రి నాయ‌కులు స‌ల‌హా.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.