కేసీఆర్ వ్య‌క్తిత్వంపై క‌మ్ముకున్న నీలినీడలు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telangana cm kcr
Updated:  2018-09-24 02:33:37

కేసీఆర్ వ్య‌క్తిత్వంపై క‌మ్ముకున్న నీలినీడలు

తెలంగాణ సీఎం కేసీఆర్ క‌ఠిన వైఖ‌రిపై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి జ్వాల‌లు ర‌గులుతున్నాయి. ఎన్నిక‌ల ప్ర‌చార వ్యూహాల్లో ఉన్న కేసీఆర్ రాష్ట్రంలో జ‌రుగుతున్నా దాడుల‌పై స్పందించే తీరిక లేక‌పోవ‌డంపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి వ్య‌క్తిత్వం ఉన్న కేసీఆర్ కోసం మ‌న‌కొడుకులు ఎందుకు ఆత్మ‌బ‌లిదానాలిచ్చారా ఆంటూ సామాన్యులు చీద‌రించుకుంటున్నారు. అందుకు కార‌ణాలు లేక‌పోలేదు. 
 
వ‌రుస ప్ర‌మాదాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా జ‌గిత్యాల జిల్లా మాల్యాల మండ‌లం ముత్యంపేట గ్రామంలో ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన అంజ‌న్న‌గుట్ట ఘాట్ రోడ్ లో పేట్ - జ‌గిత్యాల రూట్ బ‌స్సు ఘాట్ పై నుండి లోయ‌లోప‌డింది. ఈ ఘ‌న‌ట‌లో 62మంది ప్రాణాలు కోల్పోయారు.  కాఠిన్యుల‌ను సైతం క‌రిగించే ప్ర‌య‌త్నం చేసిన ఘ‌ట‌న‌పై దేశం మొత్తం ఉలిక్కిప‌డింది. సోష‌ల్ మీడియా, మీడియాలో ప్ర‌భుత్వ తీరుపై ఏకిపారేశారు. ఇంతమందిని బలితీసుకున్న బస్సు ప్రమాదానికి అతివేగం, ఓవర్‌లోడ్‌తో పాటు బ్రేకులు విఫలమవడమే కారణమ‌వ్వ‌డంతో ఆర్టీసీ ప‌నితీరును విమ‌ర్శిస్తున్నారు.
 
వాస్తవానికి ఈ బస్సు నాచ్‌పల్లి నుంచి దొంగలమర్రి మీదుగా వెళ్లాల్సి ఉంది. అయితే అప్పటికే ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బస్సును షార్ట్‌కట్‌ రూట్‌లో తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.  ఈ బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడంతో ఘాట్‌ రోడ్డులో బస్సు అదుపు తప్పడంవల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని, ప్రమాద సమయంలో ఊపిరాడక కొందరు చెందారని తెలుస్తోంది. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో వంద మందికి పైగా ప్రయాణీకులు ఉన్నారు. ఓవర్ టేక్ చేసే సమయంలో లేదా ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ ఉన్న డివైడర్లు కూడా నాణ్యతగా లేవని చెబుతున్నారు. బస్సు దాదాపు ముప్పై లోతుల అడుగులో పడిపోయింది. దీంతో భారీ ప్రాణనష్టం జరిగింది.
 
ఇంత‌టి ప్ర‌మాదంలో 62మంది చ‌నిపోతే వారిని ప‌రామ‌ర్శించే తీరిక ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు లేక‌పోవ‌డం తెలంగాణ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  ప్ర‌గ‌తినివేద‌న స‌భ‌పై ఉన్న శ్ర‌ద్ద స్వ‌రాష్ట్రం కోసం ఆత్మ‌బ‌లిదానాలు చేసుకున్న వారిపై మ‌మ‌కారం లేదా అంటూ కొన్ని మెసేజ్ లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. క‌నీసం కొండ‌గ‌ట్టు అంజ‌న్న భ‌క్తులు చ‌నిపోతే రాని కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర విభ‌జ‌నకు వ్య‌తిరేకంగా నరనరాన తెలంగాణ ని వ్యతిరేకించి - చివరికి సమైక్యాంధ్ర కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసినా వ్యక్తికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..?? నిర్వ‌హించ‌డంపై ప‌లువురు ఉద్య‌మ‌కారులు కేసీఆర్ క‌ఠిన వైఖ‌ర‌ని ప్ర‌శ్నిస్తూ సోష‌ల్ మీడియా పోస్ట్ చేశారు.
 
వాటిలో గూడ అంజన్న చనిపోతే కనీసం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు కేసీఆర్ కుటుంభం. తొలి తరం తెలంగాణ ఉద్యమ కారుడు ప్రో.కేశవరావు జాదవ్ గారు మరణిస్తే కనీసం  పరామర్శించకపోతివి.నీకు ఉద్యమంలో ఒడిదోడుకులు ఎదురైనపుడు జలదృశ్యం లో ఆశ్రయం ఇచ్చిన కొండ లక్ష్మణ్ బాపూజీ చనిపోయినపుడు కనీసం పరామర్శించక పోతివి.1200 మంది తెలంగాణ కోసం బలిదానం చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి సమయం ఉండదు.
 
తప్పుడు లెక్కలతో 400 మందికే పరిహారం ఇస్తివి.హరికృష్ణ చనిపోతే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వ‌హించ‌మ‌న‌డం, కేసీఆరే స్వ‌యంగా  భౌతిక‌కాయాన్ని సంద‌ర్శించ‌డం పై సీమాంధ్రుల్ని త‌న‌వైపుకు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నేది జ‌గ‌మెరుగ‌ని స‌త్యం.మ‌రి ఓట్ల‌కోసమే హ‌రికృష్ణ కు నివాళుల‌ర్పించిన కేసీఆర్ మా ప్రాణాలు పోతుంటే ప‌ట్టించుకునే తీరిక లేక‌పోతే..ఆయ‌న బాధిత కుటుంబాల‌కు ప్ర‌క‌టించిన ప‌రిహారం వారికి చేరుతుందా లేదా అనే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు ప్ర‌మాద‌బాధిత కుటంబాల స‌భ్యులు. పోలీసులు త‌ప్ప మిగిలిన వారు ప‌ట్టించుకోక‌పోవ‌డం, బీజేపీ నేత సంజయ్ చేసిన ఆందోళ‌న‌తో బాధిత కుటుంబాల‌కు ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించ‌డంపై కేసీఆర్ వ్య‌క్తిత్వం పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి.  

షేర్ :

Comments

5 Comment

  1. vaping cbd oil cbd oil for pain purekana cbd oil hempworx cbd | [url=https://cbdonline2018.com/]green mountain cbd[/url] [url=https://cbdonline2018.com/]leafwize cbd oil[/url]

    cbd flower cbd plus cbd salve cbd oil reviews | https://cbdonline2018.com/ - best cbd oil for pain https://cbdonline2018.com/ - cbd oil for dogs

    buy cbd oil uk cbd oil dosage is cbd oil legal cbd oil in texas | [url=https://cbdonline2018.com/]where can i buy cbd oil[/url] [url=https://cbdonline2018.com/]cbd cream for pain[/url]

    the best cbd oil on the market medterra cbd the best cbd oil on the market cbd oil for pets | [url=https://cbdonline2018.com/]best cbd oil[/url] [url=https://cbdonline2018.com/]cbd brothers[/url]

    cbd gummies does walgreens sell cbd oil cbd clinic pro cbd oil | [url=https://cbdonline2018.com/]hemp cbd oil side effects[/url] [url=https://cbdonline2018.com/]cbd clinic products[/url]

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.