ఆ సీటుకోసం కాంగ్రెస్ నేత‌లు కుమ్ములాట‌

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

congress
Updated:  2018-10-15 04:38:24

ఆ సీటుకోసం కాంగ్రెస్ నేత‌లు కుమ్ములాట‌

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు ద‌గ్గ‌రుకు వ‌స్తున్న త‌రుణంలో ఒక వైపు అధికార టీఆర్ఎస్ నాయ‌కులు త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌కటించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేస్తుంటే మ‌రో వైపు ప్ర‌తిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మాత్రం సీట్ల‌కోసం కొట్టుకుంటున్నారు. అయితే ఈ నేప‌థ్యంలో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ పై ఇప్పుటు ఆపార్టీ సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య చిచ్చు రేపింది.
 
దీంతో త‌మ‌వారికే టికెట్ ఇప్పించాల‌ని పాల‌మూరు కాంగ్రెస్ నేత‌లు ప‌ట్టుబ‌డుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జ‌గ‌దీశ్వ‌ర్ రావుకు టికెట్ ఇవ్వాల‌ని జ‌య‌పాల్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తుండ‌గా సుధాక‌ర్ రావుకే టికెట్ ఇవ్వాల‌ని మ‌రో వైపు చిన్నారెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రెడ్డికే టికెట్ ఇవ్వాల‌ని లేకుంటే ఊరుకునేదిలేద‌ని ఆపార్టీ సీనియ‌ర్ నేత డీకే అరుణ అంటున్నారు. 
 
ఈ క్ర‌మంలో సుధాక‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌ని కానీ డీకే అరుణ అభ్యంత‌రంతో ఇది వాయిదా ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున కొల్లాపూర్ టికెట్ ఎవ‌రికి ద‌క్కుతుంద‌నేది ప్ర‌స్తుతం ఉత్కంఠంగా మారింది. 

షేర్ :

Comments

0 Comment