టీఆర్ఎస్ భ‌యంతో రాయ‌భారం చెస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-08-04 18:20:59

టీఆర్ఎస్ భ‌యంతో రాయ‌భారం చెస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో తెలంగాణ‌లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడుక్కుతుంది. గ‌తంలో క‌నివినీ ఎరుగ‌ని రీతిలో వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో పొలిటిక‌ల్ ఏపిసోడ్ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారుతోంది. ప్ర‌స్తుతం వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఉన్నారు. ఈయన‌ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా టీఆర్ఎస్ ను మ‌రోసారి ఓడించి తీరాల‌ని శ‌ప‌దం చేశార‌ట‌.
 
ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ముక్కోణ‌పు పోరు సాగుతుంది. టీఆర్ఎస్ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో భ‌రిలోకి దిగ‌డానికి రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘ ఉపాధ్య‌క్షుడు నిరంజ‌న్ రెడ్డి మ‌రోసారి రెడి అవుతున్నారు. ఇక ఈయ‌న‌తో పాటు టీడీపీ పొలిటిక‌ల్ బ్యూరో స‌భ్యుడు రావుల చంద్రశేఖ‌ర్ రెడ్డి ఆప‌రేష‌న్ 2019 అని ధీమాగా ఉన్నారు. 2014లో జ‌రిగిన ప‌రాభావానికి బ‌దులు తీర్చుకోవాల‌ని టీఆర్ఎస్ ప‌ట్టుద‌ల‌తో ఉందట‌. అందులో భాగంగానే ఈ మ‌ధ్య నియోజ‌క‌వ‌ర్గంలో క్షేత్ర స్థాయిలో బ‌లం పెంచుకునే దిశ‌గా  గులాభి దండూ ఫోక‌స్ చేస్తుంద‌ట‌. 
 
ఇక వీట‌న్నింటిని గ‌మ‌నించిన సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి త‌న ప్ర‌త్య‌ర్థి రావులు చంద్ర శేఖ‌ర్ రెడ్డికి నాస్తిక‌ర‌మైన ఆఫ‌ర్ చేస్తున్నార‌ట‌. ఆ ఆఫ‌ర్ ఏంటంటే రావుల పార్టీ మారి కాంగ్రెస్ లో చేరితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌న‌ప‌ర్తి నుంచి కాంగ్రెస్ త‌ర‌పున రావులుచంద్ర‌శేఖ‌ర్ రెడ్డి పోటీ చేస్తార‌ని, తాను త‌ప్పుకుంటాన‌ని చిన్నారెడ్డి ఆఫ‌ర్ చేశార‌ట‌.
 
వ‌న‌పర్తి నియోజ‌క‌వ‌ర్గంలో చిన్నారెడ్డి వ‌ర్సెస్ రావుల చంద్ర శేఖ‌ర్ రెడ్డి ఏపీసోడ్ ద‌శాబ్దాల చ‌రిత్ర ఉంది. వీరిద్ద‌రు చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు అలాంటిది ఇప్పుడు వ‌చ్చేఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు గెలిచే ఛాన్స్ ఇవ్వ‌కూడ‌ద‌ని భావిస్తున్న చిన్నారెడ్డి..రావులు కాంగ్రెస్ పార్టీలో చేరితే త‌న సీటు త్యాగం చేయ్య‌టానికి రెడి అవుతున్నారట‌. ఈ ముక్కోన‌పు పోరులో ఓట్లు చీలిపోతే అది టీఆర్ఎస్ విజ‌యానికి కారంణం అవుతుంద‌ని భావించి ఆఛాన్స్ గులాబి పార్టీకి ఇద్ద‌కూడ‌ద‌న్న‌ది చిన్నారెడ్డి అభిమ‌తం అట. 
 
ఇక మ‌రోవైపు టీఆర్ ఎస్ కు ఇటు నిరంజ‌న్ రెడ్డి ఫుల్ ఫోక‌స్ పెట్టారు. అభివృద్ది కార్య‌క్ర‌మాల‌పై దృష్టి పెట్ట‌డం నుంచి సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లే ప్ర‌య‌త్నాలను వేగ వంతం చేయ్య‌డంతో టీఆర్ఎస్ కూ సానుకూల వాతావ‌ర‌ణం పెరుగుతుంద‌ట‌. ఈ త‌రుణంలో ముక్కోన‌పు పోరు జ‌రిగితే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే  అని నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన చిన్నారెడ్డి 2019లోత్యాగ‌య్యా పాత్ర పోసించ‌డానికి సై అంటున్నార‌ట‌. చిర‌కాల ప్ర‌త్య‌ర్ధుల‌గా ఉన్న చిన్నారెడ్డి రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిల‌కు ఇప్పుడు కామ‌న్ ఎనిమిగా మారారు టీఆర్ఎస్ నేత నిరంజ‌న్ రెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.