కోమ‌టి రెడ్డిపై క‌ఠిన చ‌ర్య‌లు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

komati reddy rajagopal reddy
Updated:  2018-09-26 04:54:53

కోమ‌టి రెడ్డిపై క‌ఠిన చ‌ర్య‌లు

గాంధీభ‌వ‌న్ లో టీ కాంగ్రెస్ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ  తాజాగా స‌మావేశం జ‌రుగుతుంది. పార్టీ చైర్మ‌న్ కోదండ‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రుగుతున్న ఈ స‌మావేశంలో కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారంపై చ‌ర్చిస్తున్నారు. కాంగ్రెస్ నేత‌ల‌తో అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి రెండుసార్లు శోకాజ్ నోటీసులు జారీ చేసింది క్ర‌మ శిక్ష‌ణ క‌మిటీ. 
 
తొలుత క్ర‌మ శిక్ష‌ణ నోటీసుకు స్పందించిన రాజ‌గోపాల్ రెడ్డి మ‌రోసారి వివ‌ర‌ణ ఇచ్చేందుకు సుముఖంగా లేర‌ని తెలుస్తుంది. దీంతో రెండ‌వ నోటీసుకు ఇచ్చిన 24 గంట‌ల గ‌డువు నిన్న సాయంత్రం ముగిసింది. దీంతో రాజ‌గోపాల్ రెడ్డిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉందిని తెలుస్తుంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో కోమ‌టి రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకుంటే పార్టీకి చెడ్డ‌పేరు రావ‌డం ఖాయం. అందుకే ఈ వ్య‌వ‌హారాన్ని కొన్ని రోజులు పెండింగ్ పెడితే బాగుంటుంద‌ని స‌ద‌రు కాంగ్రెస్ నాయ‌కులు భావిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.