కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే డేట్ ఫిక్స్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

congress party
Updated:  2018-09-25 03:53:48

కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే డేట్ ఫిక్స్

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ నేప‌థ్యంలో అధికార తెలంగాణ రాష్ట్ర‌స‌మితి పార్టీ అధ్య‌క్షుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌మ పార్టీ తర‌పున 105 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే  ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ నాయ‌కులు మాత్రం ఇంత‌వ‌ర‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. టీఆర్ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా మ‌హా కూట‌మిని ఏర్పాటు దిశ‌గా వెళ్తున్న కాంగ్రెస్ నాయ‌కులు సీట్ల స‌ర్దుబాటులో స‌త‌మ‌త‌మవుతున్నారు.
 
అయితే తాగాజా టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే అంశంపై ఆయ‌న హైక‌మాండ్ తో చ‌ర్చించ‌నున్నారు. అలాగే అక్టొబ‌ర్ 4న కాంగ్రెస్ స్క్రీనింగ్ క‌మిటీ హైద‌రాబాద్ కు రానుంది. అదే నెల 11 న పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్నాయి. 
 
అయితే ఇప్ప‌టికే ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి ముగ్గురు అభ్య‌ర్థుల పేర్ల‌ను ఖ‌రారు చేసి కాంగ్రెస్ నాయ‌కులు వాటిని అధిష్టానం ముందు ఉత్త‌మ్ ఉంచ‌నున్నారు. అధిష్టానం ఈ పేర్ల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత అభ్య‌ర్ధుల‌ను సీట్లను ఖ‌రారు చేయ‌నుంద‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.