ఆషామాషీగా తీసుకోకండి కాంగ్రెస్ హెచ్చ‌రిక‌లు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

congress party
Updated:  2018-10-24 03:23:43

ఆషామాషీగా తీసుకోకండి కాంగ్రెస్ హెచ్చ‌రిక‌లు

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో తాజాగా హైద‌రాబాద్ లో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కార్య‌వ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌పై తీవ్రంగా చ‌ర్చిస్తున్నారు. తెలంగాణ‌లో జ‌రుగ‌బోతున్న ముంద‌స్తు ఎన్నిక‌లు ఆషామాషీగా తీసుకోకూడ‌ద‌ని ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకోవాల‌ని కాంగ్రెస్ చీఫ్ ఉత్త‌మ్ కూమార్ రెడ్డి, కుంతియా అన్నారు.
 
అంతేకాదు ఎన్నిక‌లకు 45 రోజులు మాత్ర‌మే ఉండ‌గా పార్టీ కోసం శ‌క్తి వంచ‌న లేకుండా ప్ర‌తీ ఒక్క‌రు ప‌ని చెయ్యాల‌ని వారు పిలుపునిచ్చారు. ఈ నెల 28న అధికార ప్ర‌తినిధుల వ‌ర్క్ షాప్ జ‌రుగ‌నుంది. అలాగే పీసీసీ స్థాయి నాయ‌కులంతా ఇంటింటి ప్ర‌చారంలో పాల్గొనాల‌ని ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు. న‌వంబ‌ర్ 1 నుంచి 7 వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల వారిగా కార్య‌క‌ర్త‌ల స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.  

షేర్ :