కాంగ్రెస్ కు బిగ్ షాక్ టీఆర్ఎస్ లోకి సురేష్ రెడ్డి

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

suresh reddy and ktr
Updated:  2018-09-07 12:47:15

కాంగ్రెస్ కు బిగ్ షాక్ టీఆర్ఎస్ లోకి సురేష్ రెడ్డి

తెలంగాణ‌లో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం రోజు రోజుకు వేడెక్కుతోంది. ప్ర‌తిపక్ష కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత మాజీ  స్పీక‌ర్ సురేష్ రెడ్డితో మంత్రి కేటీఆర్ స‌మావేశం అయ్యారు. ఈ రోజు సురేష్ రెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్లి ప‌లు అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. అలాగే సురేష్ రెడ్డిని కేటీఆర్ టీఆర్ఎస్ లోకి ఆహ్వానించార‌ని తెలుస్తోంది.
 
మ‌రో రెండు రోజుల్లో సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లోకి చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. గ‌తంలో బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సురేష్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 2004, 2009 మ‌ధ్య‌కాలంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్రదేశ్ శాస‌న స‌భ‌కు స్పీక‌ర్ గా సేవ‌లు అందించిన సంగ‌తి తెలిసిందే. 
 
అంతేకాదు ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా నుంచి స్పీక‌ర్ గా ప‌నిచేసిన మొద‌టి వ్య‌క్తి సురేష్ రెడ్డి. 1984లో మండ‌ల స్థాయి లీడ‌ర్ గా త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించిన స‌రేష్ రెడ్డి అంచ‌లంచెలుగా ఎదిగారు. 1989, 94, 99 అలాగే 2004 ఎన్నిక‌ల్లో సురేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2009లో ఆర్మూర్ నియోజ‌కవ‌ర్గం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున పోటీచేసి ఓట‌మిపాలు అయ్యారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.