టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి కీల‌క నేత‌

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

congress and trs
Updated:  2018-09-26 04:16:08

టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి కీల‌క నేత‌

రాజ్యస‌భ స‌భ్యుడు నిజామాబాద్ నేత డీ శ్రీనివాస్ త్వ‌ర‌లోనే సొంత గూటికి కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీలో ఉన్న ఆయ‌న దేవీ న‌వ‌రాత్రుల స‌మ‌యంలో పార్టీ అధినేత రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నార‌ని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అంతేకాదు దీనికి ముహూర్తం ఖ‌రారు అయింద‌ని టీ కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు.
 
గ‌తంలో కాంగ్రెస్ తో విభేదించిన శ్రీనివాస్ టీఆర్ఎస్ లో చేరారు. అయితే ఇటీవ‌లే ప‌రిణామాలు టీఆర్ఎస్ లో ఆయ‌న ఉనికిని ప్ర‌శ్నార్థకం చేశాయి. అంతేకాదు డీ ఎస్ పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ నిజామాబాద్ టీఆర్ఎస్ నేత‌లు గులాబి బాస్ కు లేఖ సైతం రాశారు. దీంతో ఆయ‌న తిరిగి సొంత గూటికి  చేరుతార‌నే ప్ర‌చారం సాగింది. అక్టొబ‌ర్ 11 నుంచి 16  మ‌ధ్య ఆయ‌న ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.