టీఆర్ఎస్ షాక్ 11న డీఎస్ కాంగ్రెస్ లోకి ఆయ‌న‌తోపాటు మ‌రో ఎమ్మెల్సీ

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

d srinivasulu and kcr
Updated:  2018-09-05 02:53:59

టీఆర్ఎస్ షాక్ 11న డీఎస్ కాంగ్రెస్ లోకి ఆయ‌న‌తోపాటు మ‌రో ఎమ్మెల్సీ

ఏపీ రాజ‌కీయాల‌తో పాటు, తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు హాట్ హాట్ గా కొన‌సాగుతున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నిక‌ల‌కోసం త‌హ‌త‌హలాడుతున్న క్ర‌మంలో డీ శ్రీనివాసులు టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వ‌నున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. కొద్దికాలంగా త‌న‌పై ముఖ్య‌మంత్రి కుమార్తె నిజామాబాద్ ఎంపీ క‌విత, అలాగే జిల్లా చెందిన ఎమ్మెల్యేలు అందరు ఏక‌మై అన‌ను రాజ‌కీయంగా దూరంగా చేస్తున్నార‌ని ఆయ‌న వాపోతున్నారు.
 
అంతేకాదు పార్టీకి వ్య‌తిరేకంగా కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఆయ‌న నిన్న భ‌హిరంగ లేఖ కూడా రాశారు. తన‌కు గిట్ట‌ని వారు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్నార‌ని డీఎస్ మండిప‌డ్డారు. తాను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చెయ్య‌న‌ని పార్టీ అధిష్టాన‌మే త‌న‌ను స‌స్పెండ్ చెయ్య‌లాని సూచించారు. తాను ఒక వేళ పార్టీకి రాజీనామా చేస్తే త‌ప్పుచేసిన వాడిని అవుతాన‌ని అన్నారు. 
 
ఇక రాను రాను ఆయ‌న‌పై పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ను గుర్తించి టీఆర్ఎస్ గుడ్ బై చెప్పి  తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు తాజాగా కాంగ్రెస్ లో చేరేందుకు ఆ పార్టీ నేత గులాం న‌బీ ఆజాద్ తో జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌లించాయ‌ని అలాగే హైక‌మాండ్ కూడా డీఎస్ పార్టీ చేరిక‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. 
 
యూపీఏ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ, పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో ఆయ‌న ఈ నెల 11 న డిల్లీలో కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఆయ‌న తోపాటు ఎమ్మెల్సీ భూప‌తి రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నార‌ని డీఎస్ స‌న్ని హితులు చెబుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.