దేవేంద‌ర్ లేఖ‌తో డైల‌మాలో చంద్ర‌బాబు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

devendar goud image
Updated:  2018-03-10 04:38:25

దేవేంద‌ర్ లేఖ‌తో డైల‌మాలో చంద్ర‌బాబు

మ‌రో వారంలో జ‌రుగ‌నున్న రాజ్య స‌భ ఎన్నిక‌ల‌కు తెలుగు దేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌మ పార్టీ త‌రుపున అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంలో ఇంకా మీన మేషాలు లెక్కిస్తున్నారు అనేది తెలుస్తోంది... రాష్ట్రంలో మూడు స్థానాల‌కు  జ‌రుగనున్న ఈ ఎన్నిక‌ల‌కు రెండు స్థానాల్లోనే టీడీపీ విజ‌యాన్ని సాధించ‌గ‌లుగుతుంది... మూడవ‌ స్థానంలో గెల‌వాలంటే ఎమ్మెల్యేలు స‌రైన మెజార్టీ మూడ‌వ అభ్య‌ర్దికి లేదు... అయితే ఇప్పుడున్న ప‌రిస్థితిలో బీజేపీ మాత్రం స‌పోర్ట్ చేసే అవ‌కాశం క‌నుచూపు మేర చూసినా క‌నుమ‌రుగైంద‌నే చెప్పుకోవాలి... దీంతో ముఖ్య‌మంత్రి పొలిటిబ్యూరోలో చ‌ర్చించ‌నున్నారు.
 
అయితే ఈ నేప‌థ్యంలో త‌న‌కు మ‌రోసారి రాజ్య స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం ఇవ్వాల‌ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత దేవేంద‌ర్ గౌడ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబుకు  లేఖ రాశారు... రాజ్యస‌భ నుంచి వ‌చ్చిన వ్య‌క్తుల‌నే ఈ ఎన్నిక‌ల‌లో తీసుకోవాల‌ని, దేశ భ‌విష్య‌త్, ప్ర‌జ‌ల‌కు చ‌ట్టాల‌ను అమ‌లు చేయ‌డంలో రాజ్య స‌భ అధ్య‌క్షుడు కీల‌క బాధ్య‌త‌లు చేప‌డుతార‌ని దేవేంద‌ర్ లేఖ‌లో పేర్కోన్నారు...ఆయ‌న రాసిన ఈ లేఖ‌తో  చంద్ర‌బాబుకు కంటిమీద కునుకు లేకుండా పోయింద‌ని చెప్పుకోవాలి.
devendar goud
అందులో భాగంగానే తాను గ‌తంలో జడ్పీ చైర్మన్‌గా, మూడుసార్లు ఎమ్మెల్యేగా, పది సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ప‌నిచేశాన‌న్నారు.. అయితే ఇకముందు కూడా ప్రజాశ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆ లేఖలో దేవేందర్‌గౌడ్ పేర్కొన్నారు..దీంతో ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితిలో టీడీపీ త‌రుపున ఎవ‌రికి సీటు కేటాయించాల‌నేది ప్ర‌స్తుతం చ‌ర్చనీయాంశంగా మార‌నుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.