రంగంలోకి వార‌సురాలు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

dk aruna daughter image
Updated:  2018-02-26 01:38:03

రంగంలోకి వార‌సురాలు

రాజ‌కీయాల్లోకి త‌మ వార‌సుల‌ను దింప‌డానికి వ్యుహాలు ర‌చిస్తున్నారు సీనియ‌ర్ రాజ‌కీయ‌ నాయ‌కులు. ఇప్ప‌టికే క్రీయాశీల‌క రాజ‌కీయాలు చేస్తున్న వారిని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయించాల‌ని యోచిస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి పోటీ చేయాల‌ని అనుకుంటున్నారో, అక్క‌డ త‌న కేడ‌ర్‌ను త‌యారు చేసుకుంటూ.... సేవా కార్య‌క్ర‌మాల‌తో, ప్ర‌జా సేవ‌కు అంకితం చేయిస్తున్నారు.  వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాజ‌కీయ అరంగేట్రం చేయ‌డానికి నేత‌ల వార‌సులు సిద్దం అవుతున్నారు.
 
తెలంగాణలో పాలమూరు జిల్లాలో డీకే అరుణ రాజ‌కీయ నాయ‌కురాలిగా, ప్రజాప్రతినిధిగా త‌న‌కంటూ  ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. 1996లో మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్ త‌రుపున‌ పోటీ చేసి త‌న‌  రాజ‌కీయ అరంగేట్రాన్ని ప్రారంభించారు డీకే అరుణ. ప్ర‌స్తుతం తన కూతురు శృతిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడి నుంచి పోటీ చేయించాల‌ని భావిస్తున్న‌ట్లు డీకే అరుణ సన్నిహితులు చెబుతున్నారు.
 
శృతి ప్ర‌స్తుతం వ్యాపారాల్లో నిమ‌గ్నం అయి ఉన్నారు. త‌ల్లి డీకే అరుణ పిలుపు మేర‌కు పాలమూరు ప్రాంతంలో  పర్యటనకు ఆమె సిద్దం అవుతున్నారు. అయితే గ‌తంలో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఎస్‌.జైపాల్‌రెడ్డి పోటీ చేశారు. ప్రస్తుతం ఆయ‌న పాలమూరు పై దృష్టి సారిస్తున్నారు. శృతి కూడా అదే ప్రాంతంలో పర్యటన చేయ‌నుండ‌డంతో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.