కేసీఆర్ పీకిందేమిలేదు.. డీకే

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr and dk aruna
Updated:  2018-10-06 10:59:33

కేసీఆర్ పీకిందేమిలేదు.. డీకే

తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత తెలంగాణ‌లో 2014లో మొద‌టి సారిగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన‌ కేసీఆర్ రాష్ట్ర మ‌హిళ‌ల‌కు చేసింది ఏమి లేద‌ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత డీకే అరుణ మండిప‌డ్డారు. ఈ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి పై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 
 
ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న జాతకం గురించి మాట్లాడుతున్నారని ఆమె మండిప‌డ్డారు. అయితే నీ జాతకం నా జాతకం గురించి జ్యోతిష్యం చెప్పించుకుందామురా అంటూ ఆమె స‌వాల్ విసిరారు. కేసీఆర్ కి ఓట‌మి భ‌యం పుట్టి ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అమె మండిప‌డ్డారు. గ‌తంలో రఘువీరా రెడ్డి త‌మ‌కు గుండు కొట్టి అనంత‌పురం జిల్లాకు నీరు తీసుకువెళ్లార‌ని కేసీఆర్ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అయితే ద‌మ్ముంటే దీనికి సంబంధించిన ఫోటోల‌ను కేసీఆర్ చూపించాల‌ని డీకే అరుణ చిటిక‌లు వేస్తూ హెచ్చ‌రించారు. 
 
గ‌తంలో టీఆర్ఎస్ నాయ‌కులు కేవ‌లం సీట్ల కోసం, అధికారం కోసం పాకులాడి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కేసీఆర్ రాష్ట్రానికి పీకిందేమి లేద‌ని అరుణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రానున్న రోజుల్లో ముఖ్య‌మంత్రి చరిత్ర‌ను బ‌య‌ట‌పెడ‌తామ‌ని ఆమె తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.