టీఆర్ఎస్ లో చిచ్చురేపుతున్న హ‌రీష్ - కేటీఆర్ వ‌ర్గ‌పోరు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

harish rao and ktr
Updated:  2018-09-03 01:40:05

టీఆర్ఎస్ లో చిచ్చురేపుతున్న హ‌రీష్ - కేటీఆర్ వ‌ర్గ‌పోరు

ప్ర‌గ‌తి నివేద‌న స‌భ వేదిక‌గా టీఆర్ఎస్ కుటుంబం వ‌ర్గ పోరు మ‌రోసారి భ‌య‌ట‌ప‌డింది. ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం కొంగ‌ర‌కొలాన్ ప్ర‌గ‌తి నివేద‌న పేరుతో స‌మ‌రశంఖం పూరించిన కేసీఆర్ అల్లుడు హ‌రీష్ రావును విస్మ‌రించారు. కొడుకు కేటీఆర్ ను అక్కున చేర్చుకున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు మామ చెప్పాలా..అల్లుడు వినాలా అన్న‌ధోర‌ణి ఉంటే ఇప్ప‌డు మామ చెప్పేది లేదు అల్లుడికి గుర్తింపునిచ్చేది లేదు అన్న చందంగా త‌యారైంది టీఆర్ఎస్ లో కేటీఆర్ - హ‌రీష్ - కేసీఆర్ వ్య‌వ‌హార శైలి. 
 
హ‌రీష్ రావు - కేటీఆర్ వ‌ర్గపోరు స్లో పాయిజ‌న్ లా ఎక్కేస్తుంది. ఇంటిగుట్టు బ‌ట్ట‌బ‌య‌లు కాక‌పోయినా ఎవ‌రిస‌త్తా ఏంటో తెల్చుకునే ప‌నిలో ప‌డ్డారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపన, భ‌విష్య‌త్తు కార్య‌చ‌ర‌ణ నుంచి మొన్న‌టి వ‌రకు టీఆర్ఎస్ లో కేసీఆర్ త‌రువాత ఎవరు అనే ప్ర‌శ్న‌కు స‌మాధానంగా హ‌రీష్ రావుపేరు విన‌బ‌డేది. అందుకు త‌గ్గ‌ట్లే హ‌రీష్ రావు ఏ ప‌నినైనా వ్యూహాత్మ‌కంగా సెక్సెస్ పుల్ గా చేసేవారు. దీంతో కేసీఆర్ ప్ర‌తీప‌నిని అల్లుడు హరీష్ కే పుర‌మాయించేవారు. 
 
కానీ ఇప్ప‌డు అల్లుడిని ప‌క్క‌న‌పెట్టి కొడుకు ప్ర‌తిభాపాఠ‌వాలు ఎలా ఉన్నాయో చూడండి అంటూ మోసేస్తున్నారు. త‌న‌రాజ‌కీయ వార‌సుడిగా కేటీఆర్ ను తెర‌పైకి తెచ్చే ప్ర‌య‌త్నంలో అల్లుడు హ‌రీష్ రావును విస్మ‌రిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ లో హ‌రీష్ - కేటీఆర్ వ‌ర్గాలు రెండుగా చీలిపోయాయి. 
హ‌రీష్ రావు వ‌ర్గ‌ ఎమ్మెల్యేల‌కు సీఎం కేసీఆర్ వ‌ద్ద ప్రాదాన్య‌త త‌గ్గిపోవ‌డం, అదే స‌మ‌యంలో కేటీఆర్ వ‌ర్గ ఎమ్మెల్యేలకు ఏ ప‌నికావాల‌న్నా క్ష‌ణాల్లో పూర్తి చేయ‌డంతో  హరీష్ కోటరీకి కేటీఆర్ తీరు పెద్ద తలనొప్పిగా తయారైంది.      
 
అంతేకాదు ప్రతీజిల్లాల్లో ఒక‌రిపై ఒక‌రు పై చేయిసాధించేలా పావులు క‌దుపుతున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో మున్సిప‌ల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ సొంత పార్టీల నేత‌లే మున్సిప‌ల్ చైర్మ‌న్ల మీద అవిశ్వాసం పెట్టారు. ఈ అవిశ్వాసంలో పై చేయి సాధించిన కాంగ్రెస్ ప‌ద‌వుల్ని హ‌స్త‌గ‌తం చేసుకుంది.
 ముఖ్యంగా రామగుండం మేయర్ , పరకాల, భువనగిరి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో టిఆర్ఎస్ నేతలే చైర్మన్‌లుగా ఉన్నారు. ఈ నాలుగు చోట్ల అధికార పార్టీ నేతలే అవిశ్వాసానికి దిగారు. ముఖ్యంగా రామగుండం, బెల్లంపల్లి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయింది.  
 
టీఆర్ఎస్‌కు చెందిన చైర్‌పర్సన్ సునీతారాణికి వ్యతిరేకంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, ఇండిపెండెంట్ తదితర మెజార్టీ కౌన్సిలర్లు ఒక్కటయ్యారు. 34మంది కౌన్సిలర్లకు గాను 29మంది రహస్య క్యాంప్ నిర్వహించారు.  మంత్రులు, ఇతర ముఖ్యనేతలు బుజ్జగించినా అసమ్మతి కౌన్సిలర్లు పట్టించుకోలేదు. కలెక్టర్‌ను కలిసి అవిశ్వాస నోటీసు ఇవ్వ‌డంతో ఆస్థానాల్ని కాంగ్రెస్ - లెఫ్ట్ పార్టీల నేత‌లు మెజార్జీ సాధించారు. దీనంత‌టికి కార‌ణం టీఆర్ఎస్ లో కేటీఆర్ - హ‌రీష్ రావుల  వ‌ర్గ‌పోరు వ‌ల్ల పార్టీలో చీలిక‌లు జ‌రిగిన‌ట్లు తేలింది.   
 
ఆవులు ఆవులు కొట్లాడుకుంటే లేగల కాళ్ళు విరిగిన చందంగా పార్టీ లో కీలకమైన హరీష్ రావు ,కేటీఆర్ ల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ వల్ల పార్టీ కి నష్టం జరుగుతుంది. హరీష్ రావు ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతున్న క్రమంలో హరీష్ రావు తన స్థానాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఆదివారం కొంగ‌ర‌కొలాన్ లో  జ‌రిగిన  ప్రగతి నివేదన సభ కు కూడా కేటీఆర్ కు అప్ప‌గించారు సీఎం కేసీఆర్. దీంతో హ‌రీష్ రావు వ‌ర్గంలో కొంత అల‌జ‌డి చెల‌రేగింది. అల్లుడు హరీష్ రావు ఉండ‌గా మంత్రి మ‌హేందర్ రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తుంది. 
 
అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్ర‌జ‌ల‌కు ఏం చేసిందో చెప్పాల‌నే ఉద్దేశంతో స‌భ నిర్వ‌హించాల‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. అయితే ఆ స‌భ ఎక్క‌డ నిర్వ‌హించాల‌ని, జ‌న‌స‌మీక‌ర‌ణ ఎలా చేయాలి అనేక ఇత్యాది అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకునేలా కేసీఆర్ మంత్రికేటీఆర్ ను రంగంలోకి దించారు.ప‌దిరోజులు మందునుంచే కేటీఆర్ అక్క‌డే మ‌కాం వేశారు. కొంగ‌ర కొలాన్ స‌భ‌కు కావాల్సిన జ‌న‌సమీక‌ర‌ణ‌, స్థ‌లం, పార్కింగ్ , వ‌సతులు అన్నింట్లో తన మార్క్ చూపించారు కేటీఆర్.
 
ఎప్ప‌టిక‌ప్పుడు స‌భ‌గురించి మంత్రులు, ఎమ్మెల్యేల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతూ అంద‌ర్ని అల‌ర్ట్ చేశారు. ఇక టీఆర్ఎస్ లో ట్ర‌బుల్ షూట‌ర్ గా ఉన్న మంత్రి హ‌రీష్ రావును స‌భ దరిదాపుల్లోకి రానివ్వ‌లేదు. క‌నీసం స‌భ జ‌రుగుతున్న స‌మ‌యంలో మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత‌, సీఎం కేసీఆర్ ల హ‌డావిడితో  హ‌రీష్ రావుకు ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌నేది గుస‌గుస‌లు వినిపిస్తున్నారు. దీన్ని బ‌ట్టే కేసీఆర్ త‌న రాజ‌కీయ వార‌సుడు కొడుకు కేటీఆర్ అనే చెప్పే ప్ర‌య‌త్నం చేశార‌నే టాక్ న‌డుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.