ఎమ్మెల్యే పై మైక్ విసిరిన మంత్రి హ‌రీష్‌రావు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

harish rao image
Updated:  2018-03-11 02:39:54

ఎమ్మెల్యే పై మైక్ విసిరిన మంత్రి హ‌రీష్‌రావు

తెలంగాణ ప్ర‌భుత్వంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే వాళ్ల‌లో సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు మంత్రి హ‌రీష‌రావు కూడా  ఒక‌రు. ఆయ‌న చెప్పిన విష‌యాన్ని పాటించ‌ని వాళ్లు ఎవ‌రు ఉండ‌రు. అయితే తాజాగా హ‌రీష‌రావు చెప్పిన అంశాల‌ను ఒక ఎమ్మెల్యే పాటించ‌క పోవ‌డంతో ఆయ‌న పై అగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
 
జనగామ జిల్లా లోని నర్మెట మండలం బొమ్మకూరులో నిర్మించిన జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్‌–3 ద్వారా నిర్మించిన పంప్‌హౌస్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. పంప్‌హౌస్ నుంచి కన్నెబోయినగూడెం, లద్నూరు, తపాస్‌పల్లి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేశారు.  ఈ కార్య‌క్ర‌మం  త‌ర్వాత ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గోన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షత వ‌హించారు. మంత్రి మాట్లాడ‌క మునుపే స‌మ‌యం త‌క్క‌వ ఉంద‌ని సూచించారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.
 
ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావుకు ప్ర‌తి నిమిషం ఆటంకం క‌లిగింది.  అయితే దీనికి కార‌ణం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి హ‌డావిడిగా ఉండ‌డం. హ‌రీష్‌రావు ప్ర‌సింగిస్తూనే ప‌లుమార్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి సైలెంట్‌గా ఉండ‌మ‌ని  హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అలాగే ప్ర‌వ‌ర్తించ‌డంతో హ‌రీష్‌రావు ఫైర్ అయ్యారు. అంతేకాకుండా పక్కనే ప్రారంభించిన పంప్‌హౌస్‌ మోటార్ల శబ్దంతో విసిగిపోయిన  మంత్రి హ‌రీష్‌రావు  ప్ర‌సంగం మ‌ధ్య‌లోనే మైక్‌విసిరి కార్య‌క్ర‌మం నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మంత్రిని నిల‌వ‌రించ‌డానికి ప్ర‌య‌త్నం చేసిన వెళ్లి పోవ‌డంతో వేదిక మీద ఉన్న ప్ర‌జాప్ర‌తినిధులు అవాక్క‌య్యారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.