కేసీఆర్ ఓట‌మి : కేసీఆర్ చేతిలో బ‌ల్బ్..హ‌రీష్ చేతిలో స్విచ్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr and harish rao
Updated:  2018-10-15 03:08:43

కేసీఆర్ ఓట‌మి : కేసీఆర్ చేతిలో బ‌ల్బ్..హ‌రీష్ చేతిలో స్విచ్

డిసెంబ‌ర్ 7న తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్ని డూ ఆర్ డై గా తీసుకున్న పార్టీల అధినేత‌లు గెలుపుకోసం అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత‌లు గెలుపుకోసం సొంత‌పార్టీ ప‌తనాన్ని కోరుకున్న టీడీపీ తో పొత్తుపెట్టుకొని ప్ర‌త్య‌ర్ధుల అంచ‌నాల్ని త‌ల్ల‌కిందులు చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం కొడుకును సీఎం చేయాల‌నే ఆలోచ‌న ప‌క్క‌న పెట్టి..అధికారం రావాలంటే అల్లుడ్ని కాకా ప‌ట్టాల్సిందే అనే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
 
హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తుంటే.... కేటీఆర్ ఐటీ మంత్రిగా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇద్దరు కేసీఆర్ కు రెండు కళ్లుగా మారారు. కేసీఆర్ అమ్ములపొదిలో తిరుగులేని అస్త్రాలుగా తయారయ్యారు. పార్టీలో  వీరిద్దరూ రెండు వర్గాలుగా కనిపించినా ఇద్దరూ ఒక్కటే... ఇద్దరి టార్గెట్ ఒక్కటే.... ఇద్దరు ఒక్కటిగా ఉంటే మరో వర్గం పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండా ఇద్దరు వేర్వేరుగా ఉంటూ మరొకరికి అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగారు.
 
కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. ఎన్నో అంచ‌నాల‌తో అధికారంలో వ‌చ్చిన కేసీఆర్ అభివృద్ధిని మ‌రిచి హంగులు - ఆర్భాటాల‌కు ప్ర‌థ‌మ పీఠ వేశారు. దీంతో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో కేసీఆర్ పెట్టుకున్న అంచ‌నాలు త‌ల్ల‌కిందుల‌య్యాయి. అమ్మఒడి (కేసీఆర్ కిట్) ,ఆరోగ్య లక్ష్మి పథకం, కంటి వెలుగు, కళ్యాణలక్ష్మి పథకం, చేనేత లక్ష్మి పథకం, తెలంగాణ ఆసరా ఫింఛను పథకం తెలంగాణ గ్రామజ్యోతి పథకం, తెలంగాణ పల్లె ప్రగతి పథకం, తెలంగాణకు హరితహారంలాంటి  అనేక ర‌కాల సంక్షేమ ప‌థ‌కాలు అందుబాటులోకి తెచ్చినా అవ‌న్నీ ప్ర‌జ‌ల‌కు చేర‌లేద‌నే చేదువాస్త‌వం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. దీనికి తోడు ఎమ్మెల్యే, మంత్రుల‌పై లైంగిక ఆరోప‌ణ‌లు రావ‌డంతో  రాబోయే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు అంత ఈజీ కాద‌ని తేట‌తెల్ల‌మైంది. 
 
అందుకే నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు త‌న మేన‌ల్లుడిని ప‌క్క‌న పెట్టి కొడుకును న‌మ్ముకున్న‌ కేసీఆర్ త‌న రాజ‌కీయ చ‌తుర‌తుకు ప‌దునుపెట్టారు. ట్ర‌బుల్ షూట‌ర్ గా ఉన్న అల్లుడు హ‌రీష్ రావు ను అక్కున చేర్చుకుంటున్నారు. డిసెంబ‌ర్ లో జ‌రిగే ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే అల్లుడి భ‌జ‌న చేయ‌క త‌ప్ప‌ద‌ని నిరూపిస్తున్నారు. ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీష్ రావు..! తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి అధినేత కేసీఆర్ వెన్నంటే ఉన్నారు హరీష్ రావు. కేసీఆర్ కు స్వయానా మేనల్లుడే అయినా హరీష్ రావుకు కేవలం బంధుత్వం ప్రతిపాదకన మాత్రమే గుర్తింపు రాలేదు. తన చురుకుదనం, రాజకీయ వ్యూహాలతో టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా ఎదిగి అధినేత నమ్మిన బంటుగా మారారు. ఒకానొక సమయంలో పార్టీలో కేసీఆర్ తర్వాత కీలకంగా వ్యవహరించారు.
 
కేసీఆర్ ఢిల్లీ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతుంటే హ‌రీష్ రాష్ట్ర‌రాజ‌కీయాల్లో టీఆర్ఎస్ ఎజెండాను ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు ప‌రిచ‌యం చేయ‌డంలో సిద్ధ‌హ‌స్తుల‌య్యారు. ఇక ఎక్కడైనా ఎన్నికలు ఉన్నాయంటే హరీష్ రావుకు స్పెషల్ డ్యూటీ. ఆయన వెంటనే ఎన్నికలు జరిగే నియోజకవర్గానికి వెళ్లి పార్టీని గెలిపించే బాధ్యతను పూర్తిగా నిర్వర్తించే వారు. అంతటి కీలకమైన హరీష్ రావుకు క్రమంగా ప్రాధాన్య‌త త‌గ్గుతూ వ‌చ్చింది. కేటీఆర్ ను సీఎం చేయాల‌నే ఆలోచ‌న‌తో కేసీఆర్ మేన‌ల్లుడిని దూరం పెట్టారు. 
 
ఎమ్మెల్యే గా, కేబినేట్ మినిష్ట‌ర్ గా, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల గెలుపు బాధ్య‌త‌ను అప్ప‌గించారు. ఆ బాధ్య‌త‌ను విజ‌య‌వంతంగా నెర‌వేర్చిన కేటీఆర్ కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌తను మూట‌గట్టుకున్నారు. ఐటీ మంత్రిగా ఉన్న ఉద్యోగాలు రూప‌క‌ల్ప‌న చేయ‌డంలో విఫ‌ల‌మ‌వ్వ‌డం, హ‌రీష్ అనుచ‌రుల‌ను ప‌ట్టించుకోవ‌డం పై పార్టీలో చ‌ర్చాంశ‌నీయంగా మారింది. మొన్న‌టికి మొన్న సీట్ల పంప‌కాల్లో కేటీఆర్ అనుచ‌రుల‌కు పెద్ద పీఠ‌వేశారు.