మేయ‌ర్ బొంతు ప‌రిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

hyderabad mayor rammohan
Updated:  2018-08-30 15:57:11

మేయ‌ర్ బొంతు ప‌రిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి

హైద‌ర‌బాద్ న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప‌రిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా త‌యారైంది. 2014 ఎన్నిక‌ల్లో చ‌ర్ల‌ప‌ల్లి డివిజ‌న్ నుంచి కార్పొరేట‌ర్ గా విజ‌యం సాధించిన బొంతు రామ్మోహ‌న్ పార్టీ పెద్ద‌ల అండ‌దండ‌ల‌తో జీహెచ్ ఎంసీ మేయ‌ర్ గా ఎన్నిక‌య్యారు. ఇక ముంద‌స్తు ఎన్నిక‌ల దృష్ట్యా  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉప్ప‌ల్ నియోజ‌క వ‌ర్గ టీఆర్ఎస్  ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఆయ‌న ఆశ‌ల‌కు ఉప్ప‌ల్ ప్ర‌జ‌లు గండికొడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మేయ‌ర్ కు టికెట్ వ‌స్తుందా..? వ‌స్తే  ఎమ్మెల్యేగా గెలుస్తారా అనేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. 
 
న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. అందుకే నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలిపెట్టి ఎక్క‌డో ఉన్న జూబ్లిహిల్స్ - బంజారా హిల్స్ లో నివాసం ఉండేవారు. అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకునేవారు కాదు. ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉండేవారు. త‌మ‌స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు అధికారుల చుట్టూ తిరుగుతున్న ప‌రిష్కారం దొర‌క్క‌పోవ‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌, ఇంట‌ర్ మీడియ‌ట్ జూనియ‌ర్ కాలేజీలు, రోడ్లు, ప్ర‌భుత్వ స్థ‌లాల క‌బ్జా, ఉపాది అవ‌కాశాలు క‌ల్పించాల‌ని ఎన్నిసార్లు కోరినా మేయ‌ర్ ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. 
 
ముందుస్తు ఎన్నిక‌ల హ‌డావిడి ప్రారంభం కావ‌డంతో మేయ‌ర్ ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోనే తిష్ట‌వేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందాల‌ని ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా  వ‌దులుకునేందుకు ఇష్ట‌ప‌డ‌డంలేదు. ఇక ప్ర‌ధాన ప్ర‌తిక్షాలుగా ఉన్న కాంగ్రెస్ , బీజేపీ, టీడీపీ ల నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు  ఆయా నేత‌లు పావులు క‌దుపుతున్నారు. 
 
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా బండారి ల‌క్ష్మారెడ్డి, బీజేపీ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్, టీడీపీ నుంచి వీరేంద‌ర్ గౌడ్ ప్ర‌య‌త్నాలు  ముమ్మ‌రం చేశారు. వీరికి పోటీగా మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ వ‌చ్చి చేరారు.ఎన్నడూ లేని విధంగా ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ ఓట్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. బోనాల జాత‌ర‌, ప్ర‌గ‌తి నివేద‌న ఏర్పాట్లు, కంటి వెలుగు అంటూ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. కానీ ఫ‌లితం మాత్రం శూన్యం . 
 
ఇదంతా ఒకెత్తు అయితే త‌న ఒంటెద్దు పోక‌డ‌ల‌తో  ఆయ‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని, మీడియా మిత్రుల్ని దూరం పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా  ఇటీవ‌ల పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల‌తో ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కోసం జ‌న‌స‌మీక‌ర‌ణ చేసేలా మేయ‌ర్ ఓ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.  అయితే ఆ స‌మావేశానికి భారీ ఎత్తున పార్టీ కార్య‌క‌ర్త‌లు, కేడ‌ర్ వ‌స్తార‌ని ఎదురు చూసిన మేయ‌ర్ కు భంగపాటు త‌ప్ప‌లేదు. కార్య‌క‌ర్త‌ల కోసం  వంద‌ల‌సంఖ్య‌లో కూర్చిల‌ను ఏర్పాటు చేస్తే ప‌దుల సంఖ్య‌లో వ‌చ్చి షాకిచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.