బతుకమ్మ పండగ విశిష్టత ఏంటో తెలుసుకోండి..!

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

bathukamma festival
Updated:  2018-10-17 03:23:59

బతుకమ్మ పండగ విశిష్టత ఏంటో తెలుసుకోండి..!

ఆశ్వయుజ మాసం వచ్చేస్తుందంటే.. బతుకమ్మ పండుగ కూడా వచ్చేసినట్లే. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పండగ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఈ పండుగకి ఎంతో ప్రాముఖ్యత వుంది. ఎంత ప్రాముఖ్యత అంటే, రాష్ట్ర పండుగగా అధికారికంగా జరిపేంత. మరి అంతటి విశిష్టత బతుకమ్మలో ఏముంది.. అసలు బతుకమ్మ పండగ ని ఎలా నిర్వహిస్తారు. ఇప్పుడు చూద్దాం..
 
దసరాకు రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగను బతుకమ్మ పండుగ, బతకమ్మ పండుగ, గౌరి పండుగ, సద్దుల పండుగ అనే పేర్లతో వ్యవహరిస్తారు.భాద్రపదమాసం చివరి రోజు ఆశ్వీయజమాసం ప్రారంభానికి ముందు తరుణిలంతా తనువంతా కళ్లు చేసుకుని ఎదురు చూసే పర్వదినమిది. ప్రకృతి గుబాలింపులు, పూలవాసనలు, కమ్మని పాటలు, అలరించే ఆటలు, ముత్తైదుతనం కోసం ప్రతీ మగువ జరుపుకునే ఆడబిడ్డల సంబరమిది...తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి..
 
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్థిత్వం బతుకమ్మలోనే ఉంది. ఓ ముద్దుల చెల్లి, ఆమెకు ఏడుగురు అన్నదమ్ములు. అంతా వీరాధివీరులే. అందరికీ పెళ్ళిళ్లు అయ్యాయి. అన్నలకు చెల్లెలంటే పంచప్రాణాలు. కానీ వదినలకు మాత్రం