దసరా పండగ విశిష్టత ఏంటో తెలుసా.. తెలుసుకుంటే అంత శుభమే..

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

vijayadasami
Updated:  2018-10-17 05:56:18

దసరా పండగ విశిష్టత ఏంటో తెలుసా.. తెలుసుకుంటే అంత శుభమే..

దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. అలాంటి ఈ పండగ విశిష్టత ఏంటో తెలుసుకుందాం..
 
దసరా! పేరులోనే కాస్త అటు ఇటూ చేస్తే సరదా అవుతుంది. పండగలన్నిటిలోకీ విశిష్టమైంది. పది రోజులపాటు దేశవ్యాప్తంగా ఎంతో సంతోష సంభ్రమాలతో, ఆటపాటలతో జరుపుకొనే పండగ. దేవీ నవరాత్రులు జరిపి చివరి  రోజున విజయదశమిని వైభవంగా జరుపుకొంటాం. దేవీ నవరాత్రులలో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రీతిగా పూజించడమే ఈ దసరా ఉత్సవాల ప్రత్యేకత.. ఉగాది సమయంలో, అంటే వసంత ఋతువులో వచ్చేది వసంత నవరాత్రులు.
 
శరదృతువులో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినించి నవమి దాకా జరిగేవి శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రుల సమయంలో ఆదిపరాశక్తి మహిషాసురుని వధించింది కాబట్టే దానికి గుర్తుగా ఆ అమ్మను పూజిస్తారు. అందుకే ఈ శరన్నవరాత్రులనే దేవీ నవరాత్రులనీ అంటారు. దేవీ నవరాత్రులలో శక్తి ప్రధానం.దుర్గ తొమ్మిది రాత్రులపాటు రాక్షసులను వెంటాడి, సంహరించింది. చివరికి పదవ రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా 10వ రోజున విజయదశమిని దేవతలూ, భక్తులూ అత్యంత వైభవంగా జరుపుకొన్నారు.అదే ప్రాచీనకాలంనించీ ఆనవాయితీగా కొనసాగుతోంది.