కొట్టుకుంటున్న త‌ల్లి టీఆర్ఎస్ ..పిల్ల టీఆర్ఎస్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

trs
Updated:  2018-09-26 13:44:54

కొట్టుకుంటున్న త‌ల్లి టీఆర్ఎస్ ..పిల్ల టీఆర్ఎస్

ముంద‌స్తు ఎన్నిక‌లొస్తే తెలంగాణ రాజ‌కీయం ఎటువైపుకు తిరుగుతుంది. గ‌త ఎన్నిక‌ల్లాగానే ఈ సారి ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ విజ‌యం సాధిస్తుంది. కేసీఆర్ చెప్పిన అన్నీ స్థానాల్లో గులాబీ క్లీన్ స్వీప్ చేస్తుంది. అదంతా గ‌తం. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుంది.  
 
ముందుస్తు ఎన్నిక‌ల‌పై దేశం మొత్తం చ‌ర్చించుకుంటుంది. పీఎం మోడీ నాయ‌క‌త్వం క‌న్నా కాంగ్రెస్ హ‌యాంలోనే దేశ ఆర్ధిక స్థితిగ‌తులు బాగున్నాయ‌నే వినికిడి విన‌బ‌డుతోంది. కేంద్రం సంగ‌తి వ‌దిలేద్దాం. రాష్ట్రాల్లో ముఖ్యంగా స్థానిక   పార్టీల‌కు పెద్ద‌పీఠ‌వేస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ - తెలంగాణ‌లో రాజ‌కీయ ముఖచిత్రం నువ్వునేనా అన్న‌ట్లుగా త‌యారైంది. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ బ‌లంగా త‌యారైంద‌నే వాద‌న వినిపిస్తోంది. అసెంబ్లీ ర‌ద్దుకు ముందు కేసీఆర్ ఎన్నిచెబితే అన్నీ సీట్ల‌లో గెలుస్తామ‌ని చంక‌లు గుద్దుకున్న టీఆర్ఎస్ నేత‌ల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా త‌యారైంది. 
 
తొలిసారి అభ్య‌ర్ధుల జాబితాలో త‌మ‌పేర్లు ఉంటాయ‌ని ఆశించిన నియోజ‌క‌వ‌ర్గాల నేత‌ల‌కు భంగాపాటు త‌ప్ప‌లేదు. దీంతో ఎవ‌రికి వారు సొంత‌కుంప‌టి పెట్టేసుకుంటున్నారు. అస‌మ్మ‌తి వ‌ర్గ నేత‌ల్ని, కార్య‌క‌ర్త‌ల్ని త‌మ‌వైపుకు తిప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే అభ్య‌ర్ధులు నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అవినీతికి పాల్ప‌డుతున్నారు. త‌న కుటుంబీకుల‌కే పెద్ద‌పీఠ‌వేస్తూ పార్టీ సీనియ‌ర్ల‌ని సైతం గ‌డ్డిపోచ‌లా ప‌క్క‌న‌ప‌డేస్తున్నారంటూ ప్ర‌చారం ముమ్మురం చేస్తున్నారు. 
 
అలాంటి వారిలో కొండాసురేఖా దంప‌తులు, ఉప్ప‌ల్, ఎల్బీన‌గ‌ర్, జూబ్లీహిల్స్, మ‌హేశ్వ‌రం,బెల్లంప‌ల్లి, ఇబ్ర‌హీప‌ట్నం, పాలేరు,వేముల వాడ‌, పెద్ద‌ప‌ల్లి, స‌త్తుపల్లి,షాద్ న‌గ‌ర్, మేడ్చ‌ల్ ఇలా చెప్పుకుంటూ పోతే అస‌మ్మ‌తి వ‌ర్గం చాంతాడంత లిస్టుంది. టీఆర్ఎస్ ప‌రిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్ మాత్రం మ‌హాకూట‌మిలో భాగంగా ఇత‌ర‌పార్టీల‌తో చేతులు క‌లిపి మ‌రింత బ‌లంగా త‌యార‌వుతుంది. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌రిగిన అభివృద్ది ఎంత‌, అవినీతి, అక్ర‌మార్జ‌న ఎంతో చూడండి అంటూ
 
ప్ర‌జ‌ల‌కు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ ప్ర‌య‌త్నంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అస‌మ్మ‌తి వ‌ర్గాన్ని కాంగ్రెస్ పార్టీ ద‌గ్గ‌ర చేర్చుకుంటుంది.వారిలో  కొండాదంప‌తులు టీఆర్ఎస్ లో కొంత‌కాలం హ‌వాకొన‌సాగించారు. రానురాను వారి రాజ‌కీయ‌ప‌రిస్థితి చుక్కాని లేని నావ‌లా త‌యారైంది.  ఓవైపు త‌మ‌ని కేసీఆర్ పూచిక‌పుల్ల‌తో తీసిప‌డేస్తున్నాడ‌ని అనుచ‌రుల‌తో, పార్టీ కార్య‌క్ర‌మాల్లో బ‌హిరంగంగా వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కొండాదంప‌తుల్ని త‌మ‌వైపుకు తిప్పుకుంది. వారికి పార్టీలో స‌ముచిత స్థానం క‌ల్పిస్తామంటూ హామీ ఇచ్చింది. ఈక్ర‌మంలో నేడు ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీకండువా క‌ప్పుకున్నారు.
 
వీరితోపాటు మ‌రికొంత‌మంది టీఆర్ఎస్ నేత‌లు ఆపార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు స‌న్నాహాలు ముమ్మురం చేస్తున్నట్లు ఇంటిలెజెన్స్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి తొలిసారి అభ్య‌ర్ధుల జాబితాలో త‌మ‌పేరులేద‌ని ఇంత ర‌చ్చ‌జ‌రుగుతుంటే రెండోసారి లిస్ట్ లో ఆశావాహుల పేర్లు లేక‌పోతే ఇంకెంత ర‌చ్చ‌వుతుందో వేచి చూడాలి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.