టీఆర్ఎస్ లో ముదిరిన విభేదాలు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

trs
Updated:  2018-09-04 03:58:05

టీఆర్ఎస్ లో ముదిరిన విభేదాలు

నేను రాజీనామా చెయ్య‌ను కావాలంటే మీరే స‌స్పెండ్ చేసుకోండి అంటూ తెలంగాణ అధికార పార్టీకి చెందిన డీ శ్రీనివాస్ అల్టిమేట్ లేఖ రాశారు. తాజాగా నిజామాబాద్ లో త‌న అనుచ‌రుల‌తో భేటీ అయిన డీఎస్ తాను ఎటువంటి పార్టీ కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ‌లేద‌ని చెప్పారు. గ‌తంలో ప్ర‌త్యేక తెలంగాణ‌ కోసం క‌ట్టుబ‌డి ఉన్న త‌న‌లాంటి వ్య‌క్తిపై కొంత‌మంది వ్య‌క్త‌లు కావాల‌నే త‌న‌పై అభాండాలు వేస్తున్నార‌ని డీఎస్ విమ‌ర్శాలు చేశారు.
 
కొద్దికాలంగా తాను పార్టీకి వ్య‌తిరేకంగా కార్య‌క్ర‌మాల‌ను చేస్తున్నారంటూ నిజామాబాద్ ఎంపీలు, ఎమ్మెల్యేలు త‌న‌పై ఫిర్యాదు చేయ‌డాన్ని ఆయన‌ త‌ప్పు బ‌ట్టారు. త‌ర రెండ‌వ కొడుకు భార‌తీయ జ‌న‌తాపార్టీలో చేర‌డం వెనుక త‌న ప్ర‌మేయం లేద‌ని స్ప‌ష్టం చేశారు డీ శ్రీనివాస్. తాను ఎలాంటి వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలు చేశానో ఎంపీ క‌విత చెప్పాల‌ని డీఎస్ డిమాండ్ చేశారు. 
 
తాను బీజేపీకి ఉప‌యోగ‌ప‌డే విధంగా మాట్లాడాను అనడంలో అర్థం లేద‌ని అన్నారు. తాను టీఆర్ ఎస్ లో ఉండ‌టం ఇష్టం లేకుంటే ద‌య‌చేసి త‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చెయ్యాల‌ని డీఎస్ కోరారు. అయితే ఇలాంటి లేనిపోని అభాండాల‌ను త‌న‌పై వేయ‌వ‌ద్ద‌రి విజ్ఞ‌ప్తి చేశారు ఆయ‌న‌. పార్టీ సస్పెంట్ చేయ‌కుండా తాను రాజీనామా చేసి వెళ్ల‌న‌ని అలా వెళ్తె తాను త‌ప్పు చేసిన‌ట్లు ఒప్పుకున్న‌ట్లు అవుతుంద‌ని అన్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.