కాంగ్రెస్ కు బిగ్ షాక్.. టీఆర్ఎస్ లోకి జ‌ల‌గం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

congress and trs
Updated:  2018-11-03 11:25:06

కాంగ్రెస్ కు బిగ్ షాక్.. టీఆర్ఎస్ లోకి జ‌ల‌గం

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నికలు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో రాజ‌కీయ‌లు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో అసంతృప్తి నాయ‌కులు త‌మ‌కు సీటు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. తాజాగా జ‌ల‌గం ప్ర‌సాద్ రావు కూడా ఊహించ‌ని ప‌రిణామాల‌ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీకి జ‌ల‌క్ ఇచ్చి ఈ రోజు మ‌ధ్యాహ్నం మూడుగంట‌ల స‌మ‌యంలో ప్ర‌గ‌తీ భ‌వ‌న్ లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ లో చేర‌బోతున్నారు. 
 
ప్ర‌సాద్ మాజీ ముఖ్య‌మంత్రి వెంక‌ట‌రావు త‌న‌యుడు రెండు ద‌శాబ్దాలుగా ఆయ‌న ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు.ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీ వ్య‌తిరేక‌త ఆరోప‌ణ‌ల‌కు పాల్ప‌డ్డార‌న్న నెపంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయ‌న‌పై ఆరు సంవ‌త్స‌రాల‌క్రితం స‌స్పెన్ష‌న్ వేటు వేసిని సంగ‌తి తెలిసిందే. ఇక తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ప్ర‌సాద్ ప‌డిన స‌స్పెన్స్ ను ఇటీవ‌లే ఎత్తివేసింది. 
 
ఈ క్ర‌మంలో టీపీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి ప్ర‌సాద్ రావుతో మాట్లాడారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థుల విజ‌యానికి కృషి చెయ్యాల‌ని ఆయ‌న కోరారు అయితే జ‌ల‌గం మాత్రం టీఆర్ఎస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా ప్ర‌సాద్ రావు అనుచ‌ర వ‌ర్గం ఎక్కువ‌గా  ఉంది ఇప్పుడు ఆయ‌న టీఆర్ఎస్ ల