జ‌గ్గారెడ్డి అరెస్ట్ తో హ‌రీష్ కు చెక్ పెట్టిన కేసీఆర్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr and harish rao
Updated:  2018-09-19 01:18:33

జ‌గ్గారెడ్డి అరెస్ట్ తో హ‌రీష్ కు చెక్ పెట్టిన కేసీఆర్

యుద్ధం గెల‌వాలంటే రాజును చంపాలి. అదే రాజుకున్న శ‌క్తి,సామ‌ర్ధ్యాల్ని నిర్విర్యం చేస్తే. సామ‌దాన బేద దండోపాయాల్ని ఉప‌యోగించి బ‌ల‌హీనుణ్ని చేస్తే. రాజుకున్న రాజ్యం పోతుంది. అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి కేసీఆర్ అలాగే చేస్తున్నారా..? అవున‌నే అంటున్నారు నెటిజ‌న్లు.టీఆర్ఎస్ పార్టీ లో కోల్డ్ వార్ నడుస్తుంది. మేమంతా ఒకటే కుటుంబం అని చెప్పుకున్నా వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. అస‌లే ముంద‌స్తు ఎన్నిక‌లు. ఈ స‌మ‌యంలో ప‌గోడి చావుక‌న్నా..మ‌న గెలుపుముఖ్యం.ఈ స‌మ‌యంలో కొడుకు కంటే ఏదీ ఎక్కువ‌కాద‌నుకున్నారేమో అందుకే జ‌గ్గారెడ్డిని పావుగావాడుకొని..?ఫ‌్యూచ‌ర్ లో ఎవ‌రూ అడ్డురాకుండా పావులు క‌దుపుతున్నారు సీఎం కేసీఆర్.
 
గుజరాత్‌కు చెందిన ముగ్గురిని తన కుటుంబ సభ్యులుగా పేర్కొంటూ జగ్గారెడ్డి అమెరికా తీసుకెళ్లాడని ఫిర్యాదు అందటంతో సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విష‌యంలో కేసీఆర్ పై ప్ర‌తిప‌క్ష‌నేత‌లు నానా రాద్ధాంతం చేస్తున్నారు. జగ్గారెడ్డి మానవ అక్రమ రవాణా కేసులో ఆయన కేవలం పావు మాత్రమే అంటున్నారు. దీనికితోడు హరీష్ టార్గెట్ గా జగ్గారెడ్డిపై కేసు పెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగ్గారెడ్డి అరెస్ట్ అవడం.. తన వాంగ్మూలంలో హరీష్ రావు, కేసీఆర్ పేరు చెప్పడంతో కేసు కీలక మలుపు తిరిగింది.
 
ఎప్పుడో 2004లో జ‌గ్గారెడ్డితో పాటు ప‌లువురు కేసీఆర్ , హ‌రీష్ రావుల‌పై కేసులు న‌మోదు అయ్యాయి. మ‌రి ఇన్నేళ్ల‌కు జ‌గ్గారెడ్డిని అరెస్ట్ చేయ‌డానికి కార‌ణ‌మేంటి.అదో బ్ర‌హ్మ‌ప‌దార్ధం. అవ‌న్నీ ప‌క్క‌న‌పెడితే  ఈకేసులో నిద్దాయిగా ఉన్న మ‌హ్మ‌ద్ ష‌కీల్ పోలీసుల విచార‌ణ‌లో కేసీఆర్ - హ‌రీష్ రావుల హ‌స్తం ఉన్న‌ట్లు చెప్పారు. జ‌గ్గారెడ్డికూడా ఆ ఇద్ద‌రిపేర్లే చెప్పారు. షకీల్ వాంగ్మూలంలో జగ్గారెడ్డి పేరులేకపోవడం. ఇంత‌టి నిఘూడ ర‌హ‌స్యానికి కార‌ణ‌మేంటి అంటే కేసీఆర్  - కేంద్ర బీజేపీ  కొద్దిరోజుల క్రితం ఓ తెలుగున్యూస్ పేప‌ర్ లాంచింగ్ కోసం హైద‌ర‌బాద్ మారియ‌ట్ హోట‌ల్ కు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షాను మంత్రి హ‌రీష్ రావు క‌లిశార‌నే వాద‌న వినిపిస్తోంది. 
 
నాటి తెలంగాణ మూవ్ మెంట్ ప్రారంభం నుంచి కేసీఆర్ వెంటే ఉన్న హ‌రీష్ రావు 2014లో అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆయ‌న జాత‌కం మారిపోయింది. మామ ఎంత చెప్తే అంతే అల్లుడు… ఇది నిన్నటి మాట.. ఇప్పుడు మామ చెప్పేదీ లేదు.. అల్లుడికి గుర్తింపు లేదు ఇది నేటి మాట. టీఆర్ఎస్ పార్టీ లో కేసీఆర్ తర్వాత అంత కీలకమైన వ్యక్తి హరీష్ రావు. ఏ పని చెయ్యాలన్నా హరీష్ రావు చాలా వ్యూహాత్మకం గా సక్సెస్ ఫుల్ గా చేస్తాడు అని మొదట్లో ప్రతి పని అల్లుడికి పురమాయించిన మామ ఈ మధ్య అల్లుడ్ని పక్కన పెట్టి కొడుకు జపం చేస్తున్నాడు. ప్రతీదీ కేటీఆర్ కే అప్పజెప్తూ కొడుకు సమర్ధత పై ప్రశంశల జల్లు కురిపిస్తున్నాడు. 
 
దీంతో ఎన్నిక‌లపై దృష్టిసారించిన కేంద్ర‌బీజేపీ త‌న దూత‌ల్ని హైద‌రాబాద్ కు పంపించింది. కాంగ్రెస్  - టీఆర్ఎస్ నేత‌ల్ని త‌న‌వైపుకు తిప్పుకునేలా బేర‌సారాలు మొద‌లుపెట్టింది. ఈ బేర‌సారాల్లో భాగంగా మంత్రి హ‌రీష్ రావు అమిత్ షాతో వ్య‌క్తిగ‌తంగా మాట్లాడిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.హ‌రీష్ కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీనుంచి సీఎం కుర్చీతో పాటు, అడిగిన‌న్నిఎమ్మెల్యే సీట్లు ఇచ్చేలా మంతనాలు జ‌రిగాయ‌ట‌.స‌మాచారం అందుకున్న కేసీఆర్ హ‌స్తిన‌పెద్ద‌ల‌తో మంత‌నాలు జ‌రిపించారు. 
 
సార్వత్రిక ఎన్నికల దాకా గ్యాప్ దొరికితే… షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే… హరీష్ థ్రెట్ అవుతాడన్న భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని ఓ టాక్. ఇప్పటికే ముందస్తుతో మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమా వచ్చింది కాబట్టే.. హరీష్ ను లాక్ చేద్దామని మనుషుల అక్రమ రవాణా కేసును తెరపైకి తెచ్చినట్టు ప్రతిపక్ష నేతలు చెప్తున్న మాట. హరీష్ రావును భయపెట్టేందుకే జగ్గారెడ్డి కేసును శాంపిల్ గా చూపించారన్న ప్రచారం జరుగుతోంది.
తోక జాడిస్తే నెక్స్ట్ టార్గెట్ హరీష్ రావే అన్న వాదనలూ గులాబీ శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి. అది మెడకు చుట్టుకుంటే..హరీష్ రావు జీవితాంతం వెంటాడే కేసు అవుతుంది. అదే జరిగితే..తనవారసుడు కేటీఆర్ కు లైన్ క్లియర్ అవుతుందన్నది వ్యూహం. అందుకే మనుషుల అక్రమ రవాణా కేసు తెరమీదకు తెచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనితో సీఎం సీటు తనకొద్దు అని హరీష్ తోనే చెప్పించే వ్యూహానికి తెరతీసినట్టు ప్రచారం జరుగుతోంది.

షేర్ :

Comments

1 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.