కేసీఆర్ కు చంద్ర‌బాబు భ‌యం ప‌ట్టుకుందా..?

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr and chandrababu
Updated:  2018-10-15 12:52:31

కేసీఆర్ కు చంద్ర‌బాబు భ‌యం ప‌ట్టుకుందా..?

బూడిద గుమ్మ‌డికాయ‌ల దొంగ ఎవ‌రంటే బుజాలు త‌ముడుకున్న‌ట్లు ..ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌లో కాంగ్రెస్ తో పొత్తుకుంటే సీఎం కేసీఆర్ - మంత్రి కేటీఆర్ లు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు. నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్లు అవాకులు చ‌వాకులు పేలుస్తున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయ‌ని, త‌మ ఓట‌మి ఖాయ‌మ‌ని తెలిసే ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారా..?  లేదంటే స్వ‌త‌హాగా చంద్ర‌బాబు పై ఉన్న కోపంతో ఇలా మాట్లాడుతున్నారా..?
 
ఎన్నిక‌లు ప‌ట్టుమని 50రోజులు కూడా లేవు. తెలంగాణ‌లో అన్నీ పార్టీలు త‌మ ప్ర‌చారాల్ని ముమ్మ‌రం చేశాయి. ద‌స‌రా త‌రువాత ఎన్నిక‌ల క్యాంపెయిన్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. కాంగ్రెస్ - బీజేపీ పార్టీల ప్ర‌చారం తీరు ఎలా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ వ్య‌వ‌హారం చిత్ర విచిత్రంగా త‌యారైంది. ముఖ్యంగా తెలంగాణ‌లో కాంగ్రెస్ - టీడీపీ పొత్తుపెట్టుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టి నుండి గులాబీ నేత‌ల‌కు నిద్ర‌ప‌ట్ట‌డం లేదనే వార్త‌లు పొలిటిక‌ల్ స‌ర్కిల్లో చ‌క్కెర్లు కొడుతున్నాయి.
 
అందుకు ఊతం ఇచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ గురువు ఏపీ సీఎం చంద్ర‌బాబుపై నోరుపారేసు కోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైందినాడు రాష్ట్రం కోసం పోరాటం చేసే స‌మ‌యంలో కేసీఆర్ పెద్ద‌మ‌నిషిగా వ్య‌వ‌హ‌రించారు. కానీ ఇప్పుడు ఏమైంది. ప్ర‌తిప‌క్షాల పొత్తుల ప‌ట్ల అంత దిగ‌జార