కేసులో ఇరుక్కున్నావు సిగ్గు బుద్ది రాలేదా..

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr and chandrababunaidu
Updated:  2018-10-17 12:17:20

కేసులో ఇరుక్కున్నావు సిగ్గు బుద్ది రాలేదా..

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికార‌ టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా విస్రృత స్థాయిలో ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ప్ర‌చార నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై త‌మ‌దైన శైలిలో ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రవాళ్ల‌కు ప‌ట్టిన శ‌ని చంద్రబాబు అని టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తెలంగాణ‌లో ఆంధ్ర ప్ర‌జ‌ల‌పై నాలుగున్నర‌ సంవ‌త్స‌రాల్లో ఏనాడు వివ‌క్ష‌త చూప‌లేద‌ని అన్నారు.
 
అయితే ఇప్పుడు తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో చంద్ర‌బాబు నాయుడు అలాంటి అపోహలు పుట్టిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. చంద్ర‌బాబు  రాక‌ముందు ఇలాంటి స‌మ‌స్య ఎప్పుడైనా వ‌చ్చిందా అని ప్ర‌శ్నించారు. అంతేకాదు బాబు అండ్ గ్యాంగ్‌ మీ ఆస్తుల‌ను గుంజుకుంటూ త‌రిమికొడ‌తారు, అని ప్ర‌చారం చేశారు. ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో ఎవ‌రినైనా త‌రిమి కొట్టారా అని కేసీఆర్ ప్ర‌శ్నించారు.
 
ఆంధ్రా నుంచి తెలంగాణ‌కు వ‌చ్చిన వారు మంచిగా బ్ర‌తుకుతున్నార‌ని ఆయ‌న స్ఫ‌ష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కానీ, త‌మ ప్ర‌భుత్వం కానీ, తెలంగాణ ప్ర‌జ‌లు కానీ ఎంతో గొప్ప‌వార‌ని అన్నారు. అలాంటి వారిపై చంద్ర‌బాబు నాయుడు బుర‌ద జ‌ల్లుతున్నార‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. తెలంగాణ‌లో నీ పార్టీ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావు, నువ్వు ఇక్కడ రాజ్య‌మేలుతావా అని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికే ఓటుకు నోటుకు కేసులో ఇరుక్కున్నావు ఇంకా సిగ్గు, బుద్ది రాలేదా అని ఆరోపించారు. రాష్ట్రంలో నీ మ్యానిఫెస్టో ఒక్క‌టి కూడా అమ‌లుకాలేద‌ని, ఆంధ్రవాళ్ల‌కు ప‌ట్టిన శ‌ని చంద్ర‌బాబు నాయుడు అని ఆయ‌న మండిపడ్డారు.

షేర్ :

Comments

0 Comment